క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. అదిగో పులి.. ఇదిగో తోక‌. జిల్లాల్లో విస్త‌రిస్తున్న కేసులు. పెరుగుతున్న రోగులు.. త్వ‌ర‌లో వేల‌ల్లో కేసులు.. ల‌క్ష‌ల్లో రోగులు..

ఓర్నియ‌బ్బా అరేయ్ ఆపండ్రా బాబు.. రోజులు గ‌డుస్తున్నా కొద్దీ భ‌య‌పెట్టి చంపే మూక‌లు చెల‌రేగిపోతున్నాయి. మెడిక‌ల్ మాఫియాకు ఇతోధికంగా వీళ్లే మేలు చేస్తున్న‌ట్టున్నారు. ఓ వైపు ద‌వ‌ఖానాల్లో గిరాకీ లేదు. సీజ‌న్ కాద‌ట‌. స‌రే.. కొంత స‌ర్ది, ద‌గ్గు కేసులు పెరుగుతున్నాయి. వాటిని చూసీ భ‌య‌ప‌డేలా ప్ర‌చారం జోరందుకుంటున్న‌ది.

ల‌క్ష‌ల పెట్టుబ‌డులు పెట్టిన ప్రైవేటు ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాలు మాత్రం ఈ క‌రోనా రోగులు పెరిగితే బాగుండు.. అని ఆశ‌గా ఎదురుచూసే ప‌రిస్తితులు ఉన్నాయి. కానీ వాస్త‌వంగా క్షేత్ర స్థాయి ప‌రిస్థితులు వేరు. ఓమిక్రాన్‌కు అంత సీన్‌లేదు. దీనితో పొయ్యేద లేదు.. అయ్యేది లేదు. వీటినే తేట‌తెల్లం చేస్తున్నారంతా. కానీ ఇంకా ఎక్క‌డో భ‌యం గూడుక‌ట్టుకుని ఉంది జ‌నాల‌కు. వాట్సాప్‌లో ఏ చిన్న ప్ర‌చారం జ‌రిగినా.. అగో కేసులు పెరుగుతున్నాయంట‌.. టీకాలు పిల్ల‌ల‌కు కూడా ఇచ్చుకోవాలంట‌.. ఏమోమో భ్ర‌మ‌ల భ‌యాల్లో మునిగితేల‌డం మొద‌లుపెట్టారు.

స‌ర్కారు సంక్రాంతి సెల‌వులిచ్చినా.. అగ్గో చూసిర్రా.. క‌రోనా కోస‌మే సెల‌వులు.. అనేకాడికొచ్చిండ్రు మ‌నోళ్లు. పాపం.. వాళ్ల గ‌త అనుభ‌వాలు అసోంటివి. అర్థం చేసుకోవాల్సిందే. త‌ప్పుబ‌ట్ట‌లేం.కానీ మ‌రీ అంత‌లా భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు బ్ర‌ద‌ర్‌. బీ కూల్‌. ఇగ లాక్ డౌన్ ముచ్చ‌టే లేదు. ఇప్ప‌టికే ఆర్థికంగా చితికిపోయి ఉన్నాయి అన్ని కుటుంబాలు. ఇలాంటి ప్ర‌చారాలు చేస్తే ఓ ఒక్క‌రికో న‌ష్టం కాదు.. అంద‌రికీ న‌ష్ట‌మే.

You missed