మీడియా మిత్రులందరికీ విన్నపం..

ఒమిక్రాన్, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండబోవని ఇదివరకే చెప్పాం. మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. జనవరి చివరలో లాక్‌డౌన్ ఉండొచ్చునని నేను చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

–డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌

…………………………………………………………………………………..
ఆయ‌న పేరు శ్రీ‌నివాస‌రావు. ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్‌. ఓ అధికారిలా కాకుండా రాజ‌కీయ నాయ‌కుడిలా బిల్డ‌ప్ ఇస్తాడు. కొన్ని సార్లు హెచ్చుల‌కు పోతాడు. అంతా త‌న‌కే తెలుసున‌నే భ్ర‌మ‌లో ఉంటాడు. జ‌నాల‌ను భ‌య‌పెట్టించే మాట‌లు మాట్లాడ‌తాడు. లీడ‌ర్ల‌కూ చుర‌క‌లేస్తాడు. అప్పుడే అబ్బే ఏం లేదు.. ? అంతా తూచ్ అంటాడు. మ‌ళ్లీ రెండు రోజుల‌కే ఘోరం జ‌ర‌గ‌బోతుంది. అంతా చ‌స్తారు. మీ ఇష్టం .. మీ ఖ‌ర్మ‌. మ‌మ్మ‌ల్ని ఇక ఇబ్బంది పెట్టొద్దు.. మేం మాత్రం ఏం చేస్తాం.. మ‌మ్మ‌ల్ని బ‌త‌క‌నివ్వ‌రా అని నిష్టూర‌మాడుతాడు. వైరాగ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడు. త‌నే ఓ సీఎం అనుకుంటాడు. హెల్త్ మినిష్ట‌రూ అనుకుంటాడు. అన్నీ తానే అవుతాడు. నోటికొచ్చింది చెబుతాడు. చిలుక జోస్యం చెప్పిన‌ట్టు.. నాలుక నాలుగు మ‌డ‌త‌లు పెట్టి అప్ప‌టిక‌ప్పుడు తోచించి చెప్తాడు. త‌న మేథావిత‌నాన్ని చూపుతాడు. విలేక‌రుల‌నూ గ‌ద‌మాయిస్తాడు. చివ‌ర‌కు త‌న‌లా చెప్ప‌లేదే అని ఇలా నాలుక‌క‌ర్చుకుంటాడు. అంద‌రినీ అర్సుకుంటాడు.

You missed