వాక్సిన్ వేసుకోవడం వల్ల ఎక్కువ మందికి లబ్ది కలిగింది. చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.

కాని కొంత మందికి నష్టం జరిగింది. లేదా వారికి అనుమానాలు , భయాలు వున్నాయి. కనీసం వారి మాట వినాలి కదా. వారికి సాయం చేసే కార్యక్రమం , వారికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దాన్ని తగ్గించే/ సాయం చేసే ప్రయత్నం ఏదైనా ఉందా ? లేదంటే వారిని దబాయించి నోరు మూయించడమేనా ?

ఛస్తున్నాము మొర్రో అని కొంత మంది అంటుంటే రుజువులు లేవు , పీర్ రివ్యూ లేదంటే ఎలా ? వారి బాధ కూడా వినరా ? వారిది కేవలం అపోహలు అయితే కనీసం దాన్ని తొలగించరా ? ఋతు క్రమం తప్పింది , జ్ఞాపక శక్తి తగ్గింది అని వందలాది మంది అంటుంటే మాకు ఏమీ కాలేదు. మీరు అబద్దం చెబుతున్నారు అంటే ? ఎవరైనా స్త్రీ తన పీరియడ్స్ గురించి ఓపెన్ గా కామెంట్ చేయడమే గొప్ప. అబద్దాలు చెబుతారా ?

ప్రభుత్వాలకు భాద్యత లేదా ? ఆరోగ్య కరమైన చర్చ కు అవకాశం లేదా ?

మా అమ్మ వయసు ఎనభై ఏళ్ళు. రెండు డోసులు వేసుకొంది . ఆరోగ్యంగా వుంది. అంటే అందరూ ఆరోగ్యం గా ఉన్నట్టు నేను అనుకొంటే ఎలా ? కనీసం జనాలు ఏమి చెబుతారో వినే ఓపిక శాస్త్రవేత్తలకు , వాక్సిన్ సమర్థకులకు ఉండదా ?

Amarnath Vasireddy