రైతుల గోస ఎవరికీ పట్టదు. రాజకీయాలే కావాలె. అదే రాష్ట్ర రైతులు చేసుకున్న దౌర్బాగ్యం. కేంద్రం యాసంగిలో వచ్చే ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తీసుకోబోమని తేల్చి చెప్పింది. కానీ వరి వేసుకోండని మాత్రం బీజేపీ నాయకులు చెబుతారు. యాసంగిలో కేవలం బాయిల్డ్ రైసే వస్తాయా..? రా రైస్ రావా..? అని కూడా లాజిక్కులు మాట్లాడతారు. మొత్తం వచ్చేవి బాయిల్డ్ రైసే రా నాయనా అని మొత్తుకున్నా ఎవరూ వినరు.
అంతిమంగా యాసంగి ధాన్యంపై అటు కేంద్రం చేతులెత్తేసింది. ఇటు రాష్ట్రం కేంద్రాన్ని సాకు గా చూపి ఒక్క గింజ కూడా ధాన్యం కొనం అన్నది. కేసీఆర్కు తత్వం బోధపడ్డది. కఠినంగా చెప్పకపోతే నిండా మునిగేది రాష్ట్రమే. రైతుల ఆగ్రహాన్ని చవి చూసేదీ రాష్ట్రమే. కేంద్రానిది ఈ విషయంలో కత్తి కాదు నెత్తి కాదు. ఢిల్లీలో ఉండి నాటకాలాడుతున్నది. అంతే. మంత్రుల లెవల్లో అబద్దాలు ఆడటానికి కూడా వెనకాడటం లేదు. ఎంత సిగ్గు చేటు…? సరే, ఇదంతా ఒకెత్తు.. మరి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఏం చేస్తున్నది…? రేవంత్రెడ్డి దీనిపై చేసిన అధ్యయనం ఏందీ..? రైతుల పక్షాన నిలబడాల్సిన పద్దతులేంటీ..?
ఏమీ లేవు. గాయి గత్తర చేసి.. నోరు చేసుకుని తన మాటలకు మైలేజీ వచ్చేందుకు తాపత్రయ పడుతున్నాడు తప్ప.. నిజంగా రైతులకు మేలు జరిగే మాటలు , చేతలు ఉన్నాయంటే .. ఉహూ.. శూన్యం..
ఇగో ఇదే సాక్షం. కేసీఆర్ ఫామ్ హౌజ్లో వరి వేస్తున్నాడని. మరి రైతులకు ఎందుకు వరి వేయొద్దంటున్నాడని అడుగుతున్నాడు రేవంత్. కేసీఆర్ వరి వేసుకుంటాడో.. ఆ ధాన్యాన్ని మొత్తం తన గోదాములో పెట్టుకుంటాడో.. పంచుతాడో.. పుకడ్లా అందరికీ ఇస్తాడో.. నీకెందుకు భయ్… రైతులను రెచ్చగొట్టడం కాకపోతే. లక్షల ఎకరాల్లో రేపు రైతులు వరి పండిస్తే ఎందీ పరిస్థితి..? కేంద్రం కొననప్పుడు రాష్ట్రం ఏం చేస్తది. కొనలేదు. మరి రైతులు రోడ్డెక్కాలి. రోడ్డెక్కితే ప్రతిపక్షాలు పండుగ చేసుకోవాలి. కాంగ్రెస్ ఆ ఆందోళనల్లో చలి మంటలు వేసుకోవాలి. ఇదీ మీ పరిణతి. రోగానికి అసలు మందు వేయాలనుకోవడం లేదు కాంగ్రెస్. రైతులను రెచ్చగొట్టాలని చూస్తుంది. మరి అదే కదా రాజకీయం అంటారా..? అవును. కరెక్టే. కానీ..