అతనో కార్టూనిస్టు. సిద్దిపేట వాసి. పేరు నెల్లుట్ల రమణరావు..మొదటి నుంచి టీఆరెస్ అభిమాని. హరీశ్ రావంటే అభిమానం. అంతా బాగానే ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన్ను పట్టించుకున్నవారు లేరు. కడుపు కాలుతున్నది. ఆకలి మండుతున్నది. సంపాదన లేదు. పైసా రాబడీ లేదు. ఆదాయం లేక.. కార్టూన్లు వేసుకోవడం తప్ప వేరే పని రాదు.. ఏం చెయ్యాలె. ఎవడన్నా ప్రతిపక్షపోడు వచ్చి అడకపోతాడా.. వాడిచ్చిన పైసలు తీసుకుని వానికి అనుకూలంగా కార్టూన్లు వేయకపోతానా..? అని చూశాడు. వాళ్లూ పట్టించుకోలేదు.
ఎవరూ పట్టించుకోకపోవడంతో తనకు తోచిన నాలుగు గీతలు.. మూడు రాతలు రాసుకంటూ ప్రభుత్వాన్ని తిడుతూ .. అప్పుడప్పుడు పొడుగుతూ.. అప్పడప్పడు తన ఆవేదనను ఫేస్‌బుక్కులో వెళ్లగక్కుతూ.. చూశారా మిత్రమా..! నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఎవరెక్కువ జీతమిస్తే వారికే వేస్తా… అని అంటాడు. ఆ మరుసటి రోజే హరీశన్నంటే ఇష్టం కాబట్టి ఈ ఎన్నిక అయిపోయే దాకా టీఆరెస్‌కు అనుకూలంగా వేస్తా అంటాడు. టీఆరెస్ నన్ను పట్టించుకోవడం లేదు.. వ్యతిరేకం వేస్తా అని ఆ మరుసటి రోజే స్టాండ్ మార్చకుంటాడు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే కదా అని కూడా సోషల్ మీడియాలో దోస్తులను అడుగుతాడు. కానీ వారు చెప్పిన సలహా ఏమీ పాటించడు. తనకు నచ్చిందే చేస్తాడు.
ఇదంతా చూసీ చూసీ విసిగెత్తిన కొంత మంది టీఆరెస్ అభిమానులు.. ఈ కార్టూనిస్టును వ్యభిచారితో పోల్చారు. బ్లాక్‌మెయిల్ చేస్తన్నావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కొందరు .. ఏముందిబై ఫ్రీగా ఎందుకు చేయాలె.. పైసలిస్తే చేస్తా అంటుండు.. కరెక్టే కదా.. అని కూడా సమర్థిస్తున్నారు. కానీ సమర్థించేవాళ్ల కన్నా తిట్టే వాళ్ల సంఖ్యనే ఎక్కువవుతూ వస్తున్నది.
అవునూ.. ఆయనను వ్యభిచారి అని తిట్టేటోళ్లకు ఒక్కటే అడుగుతా….. అధికార పార్టీకి ఇంత జీతం రాళ్లిచ్చి ఆ బక్కచిక్కిన బిక్కచచ్చిన కార్టూనిస్టును ఆదుకోవచ్చు కదా.. ఏదో తన గీతలు తను వేసుకుంటాడు..ఆ గీతల వల్ల మీకేమీ ఉపయోగమేమీ ఉండకపోవచ్చు.. కానీ మిమ్మల్నే నమ్ముకున్నాడు కదా మొదటి నుంచి ఆ జీతం పైసలు కూడా భారమైపోయాయా.. కేసీఆర్‌కు, హరీశ్‌కు, టీఆరెస్‌కు, ప్రభుత్వానికి……నోరు తెరిచి అడుగుతున్నడు దమ్మిడి ఆదాయం లేదని, అడుకున్నా.. ఆదుకోరా.. మీరెక్కడి దయమయుల్రా నాయన….