తీన్మార్_మ‌ల్ల‌న్న‌!

వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు స‌హించ‌రు.
కుల, మ‌త‌, లింగ ప‌రంగా వున్నా అంతే తీసుకుంట‌న్న‌రు.
45 యేండ్ల‌కు పైగా బిసిల కోసం వుద్య‌మిస్తున్న ఆర్.కృష్ణ‌య్య యేనాడు నోరు జార లేదు.
మాదిగ హ‌క్కుల కోసం పోరాతున్న మంద‌కృష్ణ యెన్న‌డూ ప‌రుషంగా మాట్లాడ‌లేదు.
మారోజు వీర‌న్న పెట్టిన కుల సంఘాలు విధాన‌ప‌ర‌మైన విమ‌ర్శ‌లే చేసిన‌రు.
తెలంగాణ బిసి సంఘం – జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ ప్ర‌భుత్వ లోపాల మీద‌నే మాట్లాడుతున్న‌డు.
నీ ‘తీన్మార్’ వుక్రోషం కెసిఆర్ కులం మీద‌నా?
ప్ర‌జ‌లు యెన్నుకున్న ప్ర‌భుత్వం మీద‌నా, అట్లా అయితే ప్ర‌జ‌ల‌ను అవ‌మానించిన‌ట్టే.
ప్ర‌జాస్వామిక విలువ‌ల‌కు ప‌ట్టంగ‌ట్టిన మ‌హ‌నీయుల పేర్లు వాడుకుంటూ యిట్ల చేయ‌డం మంచిది కాదు.
యిదే ప‌ద్ధ‌తిలో వుంటే కొన్ని బ‌ల‌మైన కేసులు అయిన త‌ర్వాత బిజెపి నుంచి బ‌య‌ట‌కు నూకితే ప‌రిస్థితి యేంది?
వాల్లు అస‌లే ఆర్.ఎస్‌.ఎస్ నిబ‌ద్ధ‌త గ‌ల సిద్ధాంతం క‌లిగిన పార్టీ. వొక బిసి(మున్నూరు కాపు)బిడ్డ‌గా నిల‌బ‌డ‌గ‌ల‌వా?
డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల నీ బిడ్డ దివ్యాంగురాలైంద‌న్న‌వ్‌. ఆ పాప‌ను యేమ‌న్నా అంటే మీ కుటుంబం భ‌రించగ‌ల‌దా?
జాతీయ పార్టీలో చేరిన‌వ్‌. రాజ‌కీయం చేసి, ఆద‌ర్శంగా నిల‌బడు మ‌ల్ల‌న్నా యెలియాస్ చింత‌పండు న‌వీన్‌కుమార్‌! నీ కంటే పెద్దోడిని వ‌య‌సులో. all the best.


కొంపెల్లి వెంకట్ గౌడ్

You missed