ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావా.. పుష్ప‌లో స‌మంతా ఐటెం సాంగ్ పై ఇంకా వివాదాలు వీడ‌లేదు. కొత్త‌వి చుట్టుముడుతూనే ఉన్నాయి. మొన్న ఏపీలో పురుష పుంగ‌వుల సంఘం ఒక‌టి హైకోర్టును ఆశ్ర‌యించింది.. ఈ పాట మొత్తం మ‌గ‌జాతినే కించ‌ప‌రిచేలా ఉంద‌ని. తాజాగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ ప్ర‌సాద్ ఈ పాట‌ను భ‌క్తిపాట‌గా కూడా పాడొచ్చు. మ‌నం ఫీల‌య్యేదాన్ని బ‌ట్టి ఉంటుంది.. మాకు ఏదైనా ఒక‌టే. ఫీల‌యి చేస్తాం.. అదీ మీ కోస‌మే.. అన్నాడు. నిజ‌మే. అందులో త‌ప్పేం లేదు. కానీ స‌హ‌జంగా బీజేపీకి కోపమొచ్చింది.

ఐటెం సాంగేందీ.. దేవుడి భ‌క్తి పాట‌ల‌కు లింకేంది అని ఒంటికాలిపై దేవీపై లేచారు. సినిమాల్లో ఐటెం సాంగులు కొత్త‌వేం కాదు. బూతులు, ద్వంద్వార్థాలు కొత్త‌వి కాదు. మ‌హిళ‌ల అంగాంగాల వ‌ర్ణ‌ణ‌లూ మ‌నమంతా ఎంజాయ్ చేస్త‌నే ఉన్నాం. పైకి మాత్రం ఇలా సంద‌ర్బం వ‌చ్చిన‌ప్పుడు నీతులు వ‌ల్లెవేస్తాం. దేవీ సిన్సియ‌ర్‌గా త‌న డ్యూటీ చేశాన‌ని చెప్పుకొచ్చాడు. త‌ప్పుబ‌ట్ట‌డానికేం లేదు. గ‌ణేశ్ మండపాల వ‌ద్ద సినిమా పాట‌ల‌ను పేర‌డి చేసి భ‌క్తి పాట‌లుగా మ‌లిచి పెద్ద పెద్ద సౌండ్‌ల‌లో పెట్ట‌డం లేదా..? వాటిని భ‌క్తులు ఎంజాయ్ చేడ‌యం లేదా.. ? భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగి తేల‌డం లేదా..?

You missed