టీఆ ర్పీ రేటింగ్స్ ఎట్లా పెంచుకోవాలె. జ‌నానికి ఏదీ కావాలె..? ఏ మ‌సాల వార్త‌లు జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తారు..? ఎవ‌రి వార్త‌లు ప‌డీప‌డీ చూస్తారు..? వీటికి స‌మాధానాలు మ‌న తెలుగు మీడియాకు క‌రెక్టుగా తెలుసు. సెల‌బ్రిటీల కాలు బ‌య‌ట‌కు పెడితే చాలు అది వార్తే. మ‌రి అలాంట‌ప్పుడు స‌మంతాకు స‌ర్ది అయితే అది వార్త కాదా..? మెల్ల‌గా అంటారేంటండీ బాబు.. అది మామూలు వార్త కాదు… బ్రేకింగ్ న్యూస్‌. అందుకే మాదాంట్లో అంద‌రి కంటే ముందే బ్రేకింగ్ వేసేశాం. అదీ మా ఛానెల్ స‌త్తా. అవునూ.. ఇంత‌కీ ఏ హాస్పిట‌ల్‌కు వెళ్లింది. విజువ‌ల్స్ ఏమ‌న్నా దొరికాయా? క‌మాన్‌. అవీ మ‌న‌మే ముందియ్యాలె. మ‌న టీవే ముందు చూడాలె. మ‌న‌మే ఇలాంటి న్యూస్‌లో నెంబ‌ర్ వ‌న్ గా ఉండాలె. మీరంతా ఏం చేస్తున్నారు వ‌య్యా.. అక్క‌డ స‌మంతా హాస్పిట‌ల్‌కు వెళ్లిందంట‌. స‌ర్దితో తెగ‌బాధ‌ప‌డిపోతుందంట‌. కొద్దిగా ద‌గ్గు కూడా ఉందంట క‌దా. మ‌రి. నాకు తెలిసిన విష‌యాలు కూడా మీకు ఫీల్డులో ఉండీ తెలుసుకోలేరు.. అస‌లు మీరేం పీకుతున్నారు..?

సార్‌.. సార్‌. అదీ .. అదీ..

ఆమెకు అస‌లు ఏం కాలేదంట సార్‌.. వాళ్ల మేనేజ‌ర్ చెప్పాడు.

వాడో బోడి మేనేజ‌ర్‌. వాడికేం తెలుసు.. ఆల్రెడీ మ‌న ఛానెల్‌లో బ్రేకింగ్ ప‌డిపోయింది. నాక‌దంతా ఏం తెలియ‌దు.. ఏదో ఒక హాస్పిట‌ల్ నుంచి లైవ్ పెట్టుకో పో. ఫోన్ ఇన్ ఇయ్యు.. క‌మాన్.. త్వ‌ర‌గా. ఆమెకు ఒమిక్రాన్ క‌రోనా వ‌చ్చిన‌ట్టు డాక్ట‌ర్లు అనుమానిస్తున్నార‌ని చివ‌ర్లో చెప్ప‌డం మ‌ర‌వ‌కు. వెళ్లు.. ఇంకా చూస్తావేం….ఎక్క‌డ్నుంచి వచ్చార‌వ‌య్యా మీరు.. మ‌న ఛానెల్‌ను ఎక్క‌డికో తీసుకెళ్దామ‌నుకుంటాను.. కానీ మీ లాంటి చెత్త‌నాయాళ్లున్నారే…..!

You missed