బీకేయూ నేత రాకేష్ టికాయ‌త్ మాట‌ల‌పై దుమారం రేగుతున్న‌ది. దీనిపై తిక్క రాజ‌కీయం మొద‌లైంది. అసలు మాట్లాడిన వీడియోలు బ‌య‌ట‌కు రాలేదు కానీ.. పేప‌ర్ల‌లో మాత్రం ఆయ‌న వార్త‌లు ఒక్కోలా వ‌చ్చాయి. దిశ‌, సాక్షి, ఆంధ్ర‌జ్యోతిలలో టీఆరెస్ ను న‌మ్మొద్ద‌ని, బీజేపీకి అది బీ టీమ్ అని టికాయత్ అన్న‌ట్లుగా రాశారు. ఈనాడు, న‌వ తెలంగాణ‌ల‌లో వ‌చ్చిన ఇంట‌ర్వ్యూల‌లో తెలంగాణ ప్ర‌భుత్వానికి అనుకూలంగా మాట్లాడిన‌ట్లు వ‌చ్చింది.

ఈ రెండు భిన్న క‌థ‌నాలను తీసుకుని టీఆరెస్ సోష‌ల్ మీడియా ప్రింట్ మీడియా త‌ప్పుడు వార్త‌లు రాస్తుందంటూ.. రాష్ట్ర ప్ర‌గ‌తిని వీరు జీర్ణించుకోవ‌డం లేదంటూ మొద‌లు పెట్టింది. స‌రే.. దిశ‌, ఆంధ్ర‌జ్యోతిల‌లో త‌ప్పుడు వార్త‌లు రాశారే అనుకుందాం. మ‌రి సాక్షిలో కూడా అండ‌ర్ ప్లేలో టీఆరెస్‌ను న‌మ్మొద్దు, అది బీజేపీ పార్టీకి అనుకూల‌మ‌ని టికాయ‌త్ అన్న‌ట్టుగా ఎందుకు రాశారు..? అస‌లు సాక్షి క‌ల‌లో కూడా టీఆరెస్‌కు వ్య‌తిరేకంగా రాస్తుందా..? అది త‌ప్పుడు వార్త. అసంభవం.

సాక్షి కూడా న‌మ‌స్తే సాక్షిగా మారి చాలా రోజుల‌వుతుంది. అది ఒక్కో ద‌శ‌లో న‌మ‌స్తే తెలంగాణ‌ను మించి కేసీఆర్‌ను ఎత్తుకొని ఊరేగుతున్న‌ది కూడా. ఇదంద‌రికీ తెలుసు. మ‌రి అలాంటి సాక్షిలో అలా అండ‌ర్ ప్లేలో రాయ‌క‌పోతే బాగుండ‌దేమో అని భ‌య‌ప‌డుతూ.. అయోమ‌య‌ప‌డుతూ.. ఏదో మోహ‌మాటం మీద రాసింది. దాన్నీ వ‌ద‌ల్లేదు టీఆరెస్ సోష‌ల్ మీడియా. చూశారా.. ఈనాడులో ఎంత మంచిగా మాట్లాడాడు. కానీ సాక్షిలో ఇలా రాసింది. దిశ‌లో ఇలా త‌ప్పుడు వార్త అచ్చేశారు.. అంటూ తమ మేథావిత‌నాన్నంతా అందులో చూపించారు. ఈనాడు కూడా న‌మ‌స్తేను మించిపోయింది. అది కూడా పాఠ‌ల‌కుల‌కు తెలుసు. అది త‌న పాల‌సీకి అనుకూలంగా ప్ర‌శ్న‌లు వేసి.. అందుక‌నుగుణంగా టికాయ‌త్‌తో స‌మాధానాలు రాబ‌ట్టుకున్న‌ది. ఆంధ్ర‌జ్యోతి కూడా త‌న‌క‌నుకూలంగా ప్ర‌శ్న‌లు సంధించింది. అందుక‌నుగుణంగానే టికాయ‌త్ ఘాటుగా ఆన్స‌ర్ ఇచ్చాడు. అదే వాళ్లు రాసుకున్నారు. బ్యాన‌ర్ వార్త‌గా ఓ త‌ప్పుడు వార్త ప్ర‌చురించాల్సిన ఆగ‌త్యం ఆంధ్ర‌జ్యోతికి ఉందా..?

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ఏనాడైనా సాక్షి ఈట‌ల రాజేంద‌ర్‌కు అనుకూలంగా వార్త రాసిందా..? రాల‌య‌లేదు. అలాంటిది టికాయ‌త్ అనని మాట‌ని ఎందుకు అచ్చేసింది. ఇది నిజంగానే త‌ప్పుడు వార్త‌నా. టీఆరెస్‌ను న‌మ్మొద్దు అన్నాడు.. కాబ‌ట్టి అది రాయాల్సి వ‌చ్చింది. అంతేగానీ అది సాక్షి సొంత పైత్యం కాదు. అన‌ని మాట‌లు అన్నార‌ని ,త‌ప్పుడు వార్త‌లు రాస్తున్నార‌ని టీఆరెస్ సోష‌ల్ మీడియా చేసిన ఆరోప‌ణ‌లు డొల్లేన‌ని సాక్షి ఉదంత‌మే సాక్షి. అదొక్క‌టి చాలు.. ఏ వీడియోలు అవ‌స‌రం లేదు. ఎందుకంటే సాక్షిలో అలా రావ‌డ‌మే సాహ‌సం. అలా వ‌చ్చిందంటే అది నిజ‌మేన‌న‌డానికి అంత‌కు మించిన సాక్ష్యం ఇంకోటి లేదు. కాదంటారా..? టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌…….

You missed