ఏపీ సీఎం జ‌గ‌న్ మొండిఘ‌ట‌మ‌ని మ‌రోసారి నిరూపించుకున్నాడు. క‌నీసం త‌న‌ను సీఎంగా కూడా గుర్తించ‌ని సినీ ఇండస్ట్రీని చెడుగుడు ఆడుకుంటున్నాడు. సీని పెద్ద‌లు చ‌ర్చ‌ల పేరుతో కాళ్ల‌బేరానికి వ‌చ్చినా విన‌లేదు. సినిమా టికెట్ల విష‌యంలో త‌ను అనుకున్న ఆన్‌లైన్ విధాన‌మే ఉండాలన్నాడు. ఏబీ క్లాస్‌కు ఒక రేటు, సీ క్లాస్‌కు ఒక రేటు. అంతే అంత‌కు మించి రేట్లు పెంచుకునేది లేదు. బెనిఫిట్ షోలో మాటే లేదు.

దీంతో పెద్ద సినిమాలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు, ప్ర‌ముఖ హీరోల‌కు చెక్‌ప‌డ‌నుంది. మొన్న‌టి వ‌ర‌కు వీరిందంతా ఒక లెక్క‌. ఇక‌పై మ‌రో లెక్క‌. జ‌గ‌న్ దెబ్బ‌కు తెలుగు సినీ ఇండ‌స్ట్రీ విల‌విల‌లాడుతున్న‌ది. తెలంగాణ‌లో న‌ష్టం లేదు. కానీ సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎక్కువ‌గా ఉండే ఆంధ్ర‌లో ఈ ప‌రిస్థితి రావ‌డంతో సినీ పెద్ద‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పాన్ ఇండియ సినిమాలు తీసేందుకే ఇక పై జంకే ప‌రిస్థితి వ‌చ్చింది తెలుగు నిర్మాత‌ల‌కు.

జన‌వ‌రిలో రాజ‌మౌళి RRR సినిమా విడుద‌ల కానుంది. దీని కోసం ఎన్నో తంటాలు ప‌డ్డారు సినీ పెద్ద‌లు. కానీ విన‌లేదు జ‌గ‌న్‌. ఏ,బీ సెంట‌ర్ల‌లో 30, 50,80, సీ క్లాస్ సెంట‌ర్ల‌లో 5, 30,50 పెట్టారు. దీంతో ల‌బోదిబోమంటున్నారు సినీ నిర్మాత‌లు. ఈ నిర్ణ‌యం వెనుక ఇటు చిరు ఫ్యామిలీతో పాటు చంద్ర‌బాబు ఫ్యామిలీ.. నంద‌మూరి బాల‌క్రిష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ల‌కు చెక్ పెట్ట‌డ‌మే జ‌గ‌న్ ప్ర‌ధాన ఉద్దేశ్యం. వీరిపై రాజ‌కీయంగా జ‌గ‌న్ క‌త్తి క‌ట్టాడు. ఇప్పుడిలా ప్ర‌తీకారం తీర్చుకుంటున్నాడు.