యాడ్స్ కోసం ఎవడో విదిలించే సొమ్ముకు ఆశపడి.. ఆర్టీసీని చిన్నచూపు చూసి, కించపర్చి, పైశాచికాందం పొందిన మన హీరో అల్లు అర్జున్ ఓ సారి పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యను చూసి నేర్చుకోవాలె. పేదల ప్రయాణాల కోసం వినియోగించే ఆర్టీసీని బతికించాలి. మంచి మాటలు చెప్పాలి. ఏమీ చేయకున్నా పర్వాలేదు గానీ కించపర్చొద్దు. నష్ట పర్చొద్దు. కానీ మన హీరోలకు ఆ సోయి లేదు. ఏదో బైక్ యాడ్ కోసం ఆర్టీసీని చీప్‌గా చేసి చూపాడు అల్లు అర్వింద్. కానీ మన మొగులయ్య.. ఇలా ఆర్టీసీని తల్లితో పోల్చాడు. అందులో ప్రయాణం ఎంతో ఆనందం అని పరవశించాడు. తన పాటతో ఎంతో కొంత సంస్థకు మేలు జరిగితే చాలనుకున్నాడు. పైసలు లేకపోయినా… తన మనసెంతో ఐశ్వర్యమని చాటాడు.. పైసల కోసం కాకుండా ప్రజల కోసమే తన గానమని నిరూపించాడీ భీమ్లానాయక్.