చంద్రబాబుకు జరిగిన ఘోర అవమానానికి ఎవరూ మనస్తాపం చెందవద్దని, తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్దమవుతున్నారని తమకు సమాచారం ఉందని, అలా చేయవద్దని అచ్చెన్నాయుడు కోరాడు. బాబును ఎవరు.. ఎందుకు… ఏమని తిట్టారో కూడా ఎవరికీ తెలియదు. ఆయన వెక్కి వెక్కి ఏడ్చింది మాత్రం చూసి చాలా మంది నవ్వుకున్నారు. జోకులేసుకున్నారు. ఇది డ్రామా అన్నారు. బాగైంది నీకు అట్లనే కావాలని కచ్చగా అనుకున్నారు. కొందరు మాత్రం అయ్యో ఎంత ఖర్మొచ్చెరా బాబు అని సానుభూతి చూపారు.
సరే, ఇప్పుడు ఆయన కోసం చావుల దాకా సిద్దపడేదెవ్వరు..? బాబు ఎవర్నేం ఉద్దరించాడని. చస్తే గిస్తే మంత్రులుగా చేసినోళ్లు, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేలుగా పదవులు వెలగబెట్టినోళ్లు చావాలి. వాళ్లెందుకు చస్తారు. మీరెందుకు చస్తారు..? ప్రజలను చంపుతారు. వాళ్లు చావకున్నా.. చంపేసి ఆ చావులను మన బాబుగోరి ఖాతాలో జమ చేసేట్టున్నార్రా మీరు. మీ దుంపలు తెగ. మీ రాజకీయాలు అలా ఏడిశాయి మరి. తెలుగు రాష్ట్రాల్లోనట మళ్లీ. తెలంగాణలో అసలు టీడీపీ ఉందా? బాబును ఇక్కడ అభిమానించే వారు కూడా ఉన్నారా? మరి పార్టీని ఇక్కడ బతికించేందుకు ఇదే అవకాశమని కొందరి చావులను కోరుకుని అవి ఖాతాలో వేసేసుకుంటారా? కానీ, మరి. మీరు మీ చావు రాజకీయాలు.
రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ఇలా చావులన్నీ తమ ఖతాల్లో వేసుసుకున్నారు. ఎంత మంది చస్తే మీ పరపతి అంతలా పెరిగిపోతుందన్నమాట. మీ రాజకీయ మైలేజీకి ఈ చావు డప్పులు అంత ఊపునిస్తాయన్నమాట.