స‌ర్కారు ద‌వాఖానల్లో మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు క‌లెక్ట‌ర్లు బాగానే కృషిచేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు వీటిపై న‌మ్మ‌కం సన్న‌గిల్ల‌కుండా సేవ‌లు మ‌రింత మంచిగా అందేలా వారు కూడా ఇక్క‌డే వైద్య చికిత్స‌లు చేసుకుంటూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. మొన్న ఖ‌మ్మం అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్, తాజాగా ఖ‌మ్మం కలెక్ట‌ర్ కూడా గ‌వ‌ర్న‌మెంటు ద‌వాఖాన‌లోనే ప్ర‌స‌వమ‌య్యింది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స‌ర్కారు ద‌వాఖాన‌ల్లో తాము లేదా త‌మ కుటుంబ స‌భ్యుల డెలివ‌రీలు చేయించుకుంటున్నారు. ప్ర‌జల్లో ఈ ద‌వాఖాన‌ల ప‌ట్ల న‌మ్మ‌కాన్ని ప్రోది చేసేలా చేస్తున్నారు. కానీ మ‌న లీడ‌ర్ల‌కే ఇంకా న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. ఎవ‌రైనా ఓ నాయ‌కుడు… ఇలా చేస్తున్నాడా..? ప్ర‌తిప‌క్షాలు వ‌దిల‌పెట్టండి.. అధికార ప‌క్షం నాయ‌కులెవ‌రైనా క‌న్నెత్తి ఇటువైపు చూస్తున్నారా?
…………………………………………………………………………………………….

సర్కారు దవాఖానలో కలెక్టర్‌ భార్య ప్రసవం..
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు

భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్విట్టర్‌ వేదికగా కలెక్టర్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు అధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ప్రజలు గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లోనే వైద్యం చేయించుకునేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. అందుకు నిదర్శనం కలెక్టర్‌ దంపతులేనని మంత్రి ప్రశంసించారు.