జైభీం సినిమాలోని
రాజన్న భార్య బిడ్డ,
ఆయన ఇద్దరు స్నేహితులు,
వారి బంధువుల పట్ల సమాజం
ఎంతటి ధాష్టికతను ప్రదర్శిస్తుందో..

ఈ దేశంలోని కోట్లాది మంది సంచార జాతుల
జీవిత సమస్యలకు అద్దం పడుతోంది..

నిన్న రాత్రి ప్రీమియం వీడియోస్ సైట్ లో
జైభీం సినిమా చూస్తున్నంతసేపు

నలబై సంవత్సరాల
క్రితం నా బాల్య స్మృతులు కళ్ళముందే
గిర్రున తిరిగినట్టైయ్యింది.
నా చుట్టూ భయంకరమైన ఈ లాంటి ఘటనలు
చూసిన సందర్భాలెన్నో ఉన్నాయి..

జైభీం సినిమా లో రాజన్న భార్య,బిడ్డలను
నా బాల్యంలో ఎంతోమందిని చూసిన గుర్తులు
సినిమా చూసేంతసేపు ఏడ్పించాయి..
1996లో నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం
నర్సింగ్ నల్లి గ్రామానికి చెందిన ఐదుగురు వడ్డెర్లను
దొంగతనం నేపంతో నిజామాబాద్ జిల్లా పోలీసులు
లాకప్ డెత్ అంటే చట్టం ముసుగులో పోలీసులు చేసిన సామూహిక హత్యలు.

★ ఆర్మూర్ మండలం లక్కోర గ్రామం వద్ద సచ్చిన శవాలపై
కాల్పులు జరిపి బస్సు దోపిడీకి ప్రయత్నించిన దొంగల ముఠాపై పోలీసుల సాహసోపేతమైన పోరాటం ద్వారా
దొంగలను హతమార్చారని ఈ దొంగలు
వడ్డెర్లని వీరి ప్రధాన వృత్తి దొంగతనాలని
పోలీసు ఉన్నతాధికారుల చెప్పినట్లుగా
మీడియా సాధానాల్లో కథనాలు,
హంతకులకు పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు..
ఇది మన స్వాతంత్ర‌ దేశంలో సంచార జాతుల పరిస్థితి..
జైభీం రాజన్న కోసం ఒక చండ్రు అనే పౌరహక్కుల న్యాయవాది ఉన్నారు.

ఇక్కడ అలాంటి పౌరహక్కుల నేతలు లేకపోవడం,
అప్పటికే ఉన్న బొజ్జతారకం, డాక్టర్ బాల్ గోపాల్ లాంటి
ప్రజల న్యాయవాదులకు విషయాన్ని వివరించే
పరిస్థితి నాలాంటి వాడికి ఒక రాజకీయ నిర్మాణం అడ్డుగా ఉండడంతో ఆ భాదితుల పక్షాన నిలబడి పోరాటం చేయలేకపోవడం అత్యంత బాధాకరంగా ఇప్పటి నేను భావిస్తుంటాను.
★ మరో సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన 14 మందికి భూమి కోసం జరిగిన పోరాట పెనుగులాటలో ఒక దళిత ఫారెస్ట్ అధికారి గాయపడిన మృతి చెందగా
14 మందికి జీవిత ఖైదు పడింది..
ఇందులో 12 మంది వడ్డెర్లు, ఒకరు మందుల, మరొకరు
ముదిరాజ్ 14 మందిలో అందరూ అత్యంత నిరుపేదలే.

ఇదే ఆధిపత్య కులాలకు చెందిన వారికి ఇలాంటి శిక్షలు పడగలవా…
అని ప్రశ్నించే సామాజిక చైతన్యం లేని
సంచార జాతులకు 75 సంవత్సరాల స్వాతంత్ర‌ భారతంలో
రాజ్యాంగ హక్కులు మేడిపండు ప్రజాస్వామ్య లాంటిదే
అని రుజువైంది.

1871లో బ్రిటిష్ ముష్కరులు తెచ్చిన క్రిమినల్ ట్రైబ్స్ నేర చరిత్ర జాతుల చట్టం..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 4 సంవత్సరాల వరకు
అధికారికంగా అమల్లో ఉంటే..

1951లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు
పార్లమెంట్ లో జాతి కి క్షమాపణలు కోరుతూ
నోటిఫైడ్ ట్రైబ్స్ చట్టాన్ని డీనోటిఫైడ్ గా మారుస్తూ
దేశవ్యాప్తంగా బాధితుల కోసం డిఎన్టీ హాస్టల్స్ ఏర్పాటు చేశారు.

కానీ ఎస్సీ,ఎస్టీలలో ఉన్నట్లుగా ఎదిగిన నాయకత్వం లేకపోవడంతో
డీనోటిఫైడ్ ట్రైబ్స్-డిఎన్టీల సమస్యలు సమస్యలుగా మిగిలి పోయాయి…
ఒక జాతి అస్తిత్వపు జాడల ఆనవాళ్లను ధ్వంసం చేసిన
బ్రిటిష్ వాడు పోయిన,
వాడి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న
ఆధిపత్య దోపిడి వ్యవస్థ అదే నల్ల చట్టాలతో
నేటికీ ఈ జాతుల పట్ల కనికరం లేకుండా
దారునాతి దారుణంగా వేధించిన ఘటనలు కోకొల్లలుగా
ఉంటాయి.
వీరిపై జరిగే అత్యాచారాలు, హత్యలు
ఈదేశంలోని దోపిడి వర్గ మీడియా సాధానాలకు
కనిపించకపోవడంలో ఆశ్చర్యమేమిలేదు.

ఈ డిఎన్టీ ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక విముక్తి కోసం
జరిగిన పోరాటాల ఫలితంగా 2008లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం బాలకృష్ణ రేణుకే
కమిషన్ ద్వారా గుర్తించిన విషయం ఏమిటంటే..
దేశవ్యాప్తంగా సంచార జాతులకు
ఎస్సీ, ఎస్టీలకు ఏవిధంగా ఉన్నాయో..
సంచార జాతులకు ఆర్థిక,రాజకీయ, విద్యా,ఉపాధి రంగాల్లో
10% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ భారత పార్లమెంట్ కు
సిఫార్సు చేసింది.
★ 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం
ఇంకా భారతీయకరణ చెందని సంచార జాతులకు ఇవ్వాలసిన
10% రిజర్వేషన్ల ను ఇప్పటి వరకు దేశాన్ని కులాల కుంపటిగా మార్చిన ఆధిపత్య దోపిడి కులాలకు చెందిన పేదలకు రిజర్వేషన్లు కల్పించే చట్టం తెచ్చిన రాజ్యాంగ స్పూర్తినే దెబ్బతీశారు బిజెపి పాలకులు..
జైభీం సినిమా ద్వారా సంచార జాతుల సమస్యలను
ప్రధాన ఎజెండాపైకి తెచ్చిన తమిళ సినీ ప్రముఖులు జ్యోతిక,సూర్యలకు
అఖిల భారత ఎంబిసి& డిఎన్టీ అధికార్ మంచ్
(సంచార జాతుల సంఘం)
ఆలిండియా కమిటీ తరుపున ధన్యవాదాలు..

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తరువాత
చరిత్రకు సంబంధించిన సినిమాలు చేయడం సాధ్యం కాదు.
ఎందుకంటే ఆయనకు ఒక స్పష్టమైన
దృక్పథం ఉంది.
అందుకే ఆయన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా ద్వారా బ్రాహ్మణాధిపత్య పూజారి వర్గంపై నిరసన వ్యక్తం చేశారు.
గౌతమ బుద్ధుడిని హుస్సేన్ సాగర్ లో పెట్టి చరిత్రలో ఒక స్థానాన్ని పొందారు.
ఆయన ,కృష్ణ,నాగేశ్వరరావు లాంటి వాళ్లు రాజకీయ బేరగాళ్ళుతో అక్రమ వ్యాపార సంబంధాలు లేవు కనుకనే
వారు సామాజిక మార్పుకోసం కొంత ప్రయత్నం చేశారు.
ఇక దక్షిణ భారతదేశానికి చెందిన ద్రావిడ బహుజన చరిత్రకు
సంబంధించిన వివరాలు తెలుగు రచయితలకంటే
తమిళ రచయితలకే ఎక్కువగా తెలుస్తోంది ఎందుకంటే
వారు చరిత్రకు సంబంధించిన ఆధారంగా సినిమాలు తీస్తారు.
వాటిని మన తెలుగు నిర్మాతలు కొనుగోలు చేసి మార్పులు చేర్పులు చేసి కృత్రిమ చరిత్రను చొప్పించడం మన వారి ప్రతిభ కనబరుస్తుంటారు.
ఉదాహరణకు సైరా నర్సింహారెడ్డి లో
ఒడ్డె ఓబన్న పాత్రను తమిళనాడుకు చెందిన వ్యక్తిగా చిత్రీకరించారు..
కారణం కుల సంకుచితమే..
జైభీం సినిమాలు మరిన్ని రావాలి
ఇలాంటి సినిమాలు తీసే దర్శక,ని‌ర్మాతల సినిమాలను
బహుజన వామపక్ష, విప్లవ శక్తులు, అభ్యుదయ ప్రజాస్వామ్య వాదులు ప్రోత్సాహించాలి
వారి సినిమాలకు ప్రజా ఉద్యమ సంస్థలు, సంఘాలు
ప్రమోటర్స్ గా పని చేయాలని అభిలాషిస్తూ…

సామాజిక జైభీంలతో..
దండి వెంకట్
వర్కింగ్ ప్రెసిడెంట్ బహుజన లెఫ్ట్ పార్టీ-BLP
తెలంగాణ రాష్ట్ర కమిటీ,హైదరాబాద్.
4-11-2021

You missed