హుజురాబాద్ గెలుపు తర్వాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు శక్తులన్నీ మోహరిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ మరీ దూకుడును ప్రదర్శిస్తున్నది. పెట్రోల్, డిజీల్ రేటును కొద్దిగా తగ్గించిందో లేదో.. ఇక రాష్ట్రం కూడా తగ్గించాలని ఒత్తిడి పెంచుతూ వస్తోంది. మెట్రో స్పీడ్‌తో వందను ఎప్పుడో దాటించి కంటి తుడుపు చర్యగా దీపావళి ధమాకా అంటూ మోడీ పెట్రోల్, డీజీల్ ధరలను కొంతలో తగ్గించి పండుగ చేసుకోండని అనేశాడు.
ఇక మీరేం చేస్తన్నారు.. మీరు తగ్గించండి.. అన్ని రాష్ట్రాలు తగ్గించాయి.. అంటూ తెలంగాణ సర్కార్‌పై బీజేపీ శ్రేణులు ఒత్తిడికి దిగాయి. మేం గ్యాస్ ధర కూడా తగ్గిస్తాం.. కానీ మీరు నిరుద్యోగ భృతి ప్రకటించండి అని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేం గ్యాస్ ధర తగ్గించేది లేదు.. మీరు నిరుద్యోగ భృతిఇప్పట్లో ఎలాగూ ఇవ్వరు.. అనేది వారి ఆలోచన కావొచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇంకా ఎన్నో మిగిలిపోయి ఉన్నాయి. ఈ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నోసార్లు ఎన్నికల సమయంలో ప్రకటించి..ఎన్నికల తర్వాత మరిచిపోయారు.
ఇక ఇప్పుడైతే హుజురాబాద్ ఎన్నికలో ఓడిపోయిన నైరాశ్యంలో టీఆరెస్ ఉంది. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యాడు. ఇక నిరుద్యోగ భృతే కాదు.. ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశం లేదు. కొత్త పింఛన్ల ఫైల్‌కు బూజు పట్టాల్సిందే. ఇది హుజురాబాద్ ఎన్నిక స్టంట్ మాత్రమే. దళిత బంధు అమలు కూడా ఇప్పట్లో కనిపించడం లేదు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నో హామీలిచ్చార. వాటికి లెక్కేలేదు. ఇప్పుడు వాటి ప్రస్తావన ఎవరూ తీయరు. కానీ బీజేపీ మాత్రం ఇవన్నీ తోడుతున్నది. టీఆరెస్‌పై ముప్పేట దాడికి సిద్దమవుతున్నది.