హుజురాబాద్ మహా సంగ్రామం ముగసింది. అందరి దృష్టీ ఇప్పుడు దీని మీదే. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. గెలుపు ఎవరిని వరించనుందని. పోలింగ్ భారీ పెరిగింది. ఇది ఎవరి కొంప ముంచనుంది..? ఎవరిని విజయతీరాలకు చేర్చనుంది..? అనేది కూడా చర్చలో భాగమైంది.
సహజంగా పోలింగ్ శాతం పెరిగితే .. అధికార పార్టీకి ప్లస్ అవుతుందంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌గా మారినట్టు తెలుస్తోంది. పెరిగిన పోలింగ్ శాతం బీజేపీకి కలిసి వచ్చేటట్టుంది. చివర వరకు హోరా హోరీగా అధికార పార్టీతో తలపడ్డాడు ఈటల. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా బీజేపీకే అనుకూలమని చెబుతున్నాయి. కౌటిల్య సొల్యూషన్ బేజేపీకి -47 శాతం, టీఆర్ఎస్‌కు -40 శాతం అని తేల్చగా, నాగన్న ఎగ్జిట్ పోల్ బీజేపీకి 45.50శాతం, టీఆర్ఎస్ – 48.9 శాతంగా తేల్చింది. మిషన్ చైతన్య ఎగ్జిట్ పోల్ బీజేపీకి 59.20 శాతం, టీఆరెస్‌కు -39.26శాతం, పొలిటికల్ ల్యాబరేటరీ ఎగ్జిట్ పోల్ బీజేపీకి -51 శాతం, టీఆరెస్‌కు -42 శాతంగా తేల్చింది. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపే ఉన్నాయి.
విపరీతమైన ఖర్చు చేసినా.. అధికార పార్టీ ఈ ఎన్నికలో గెలుపు కోసం ఎదురీదే పరిస్థితినే తెచ్చిపెట్టుకుంది. ఈటల రాజేందర్ కు అన్ని వర్గాల నుంచి స్వచ్చంధంగా మద్దతు లభించినట్టయ్యింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు ఈటల పై సానుభూతి, ఉద్యమకారుడిగా గుర్తింపు, ఉద్యమకారుల మద్దతు.. ఇలా అన్ని అంశాలు కలిసి వచ్చాయని భావిస్తున్నారు.
మొన్నామధ్య ఈటల రాజేందర్ అన్నట్టు.. ఈ ఎన్నిక ఫలితం సర్వేలకందదు.. పత్రికల అంచనాకు చిక్కదన్నట్టే ఉంది పరిస్థితి. బ్యాలెట్ బాక్సులో ఓటరు తీర్పు నిక్షిప్తమై ఉంది. మరో రెండు రోజులు ఈ ఉత్కంఠ కొనసాగనుంది.