ఆంధ్రలో బూతు రాజకీయాలే కాదు.. జర్నలిజం కూడా బూతును అచ్చు అలాగే అచ్చుగుద్దినట్టు అచ్చేస్తున్నది. మీడియా సంప్రదాయాలు, ఆంక్షలు, విలువలు, తొక్కాతోలు అన్నీవదిలేసి ఏపీ సాక్షి కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది. టీడీపీ లీడర్ పట్టాబీ .. సీఎంను బోసీడీకే అన్నాడని అదే పదాన్ని సాక్షి ఏపీ ఎడిషన్‌లో మొదటి పేజీలో ఎర్రింకుతో అచ్చేసి తన నిఖార్సయిన జర్నలిజాన్ని చాటుకున్నది.
అవును .. సోషల్ మీడియాలో పొద్దున లేస్తే బోలెడు తిట్లు.. బూతులు. దీన్నెవరైనా అడ్డుకుంటున్నారా? ఆపుతున్నారా? నియంత్రిస్తున్నారా? అవి మాత్రం జనాల్లోకి పోతాయి.. కోట్లు పెట్టి ఇలాంటి సమయంలో కూడా మా సీఎంను గలీజు మాట తిట్టిండనే కసితీరా రాసుకోవడానికి కూడా వెనుకాముందాడాలె. ఛస్.. ! నిబంధనలన్నీ గోదాట్లో తొక్కేశాం. లంజాకొడుకా.. అగో ఈ బూతు ఎక్కడ్నుంచి వచ్చింది. వాళ్లే రాశారు. సాక్షి వాళ్లు. బ్రాకెట్లో బోసీడీకే అని పెట్టారు. ఎవరికైనా ఈ బోసీడీకే అనే బూతు పదానికి అర్థం తెలియకపోతే ఎలా..? దాన్నీ మేమే వివరిస్తాం. విశదీకరిస్తాం అని అనుకున్నట్టున్నారు.
సీఎం జగనే స్వయంగా ఏ వేదికపై ఈ బూతు పదాన్ని నోటి నిండా పలికి.. నన్ను ఇలా తిట్టారని చెప్పుకొచ్చాడు. అబ్బ.. ఎంత బూతుమయమైన రాజకీయమో కదా. మన లీడరే స్వయంగా ఆ బూతు పలికాడు కదా.. మనం రాయకపోతే ఎలా అని .. సంశయించి.. తటపటాయించి.. తల్లడమల్లడమయి.. చివరకోసారి జగన్నూ సంప్రదించి.. క్లారిటీ రాగానే ఇలా కసితీరా తోసేశారు. ఎర్ర సిరాతో చిమ్మేశారు. గుడ్.. కీపిటప్.. జర్నలిజం వర్దిల్లాలి..!!