పోలీసు ఒక్క‌సారి పోయామా.. దెబ్బ‌లు తిని రావాల్సిందే. ఎక్క‌డెక్క‌డో కొడ‌తారో తెల్వ‌దు. థ‌ర్డ్ డిగ్రీ పేరుతో తాటా తీస్తారు. వీపు సున్నం చేస్తారు. కాళ్లు పైకి చేతులు కింద‌కు వేలాడ‌దీస్తారు. లాఠీలు కాళ్ల సందుల్లో పెట్టి కుళ్ల‌బొడుస్తారు. ఇంకా ఏమోమో చేస్తారు. అవి అనుభ‌వించిన వాడికే తెలుస్తాయి. పోలీసు మామాల మ‌ర్యాద‌లు మామాలుగా ఉండువు మ‌రి. ఈ పోలీసు ..ఆ పోలీసు అని కాదు.. వీళ్ల‌దంతా ఒకేజాతి. అధికార పార్టీ ఏం చెబితే అది చేసేస్తుంది ఈ ఖాకీ. వాళ్లంతే మ‌రి. విధి నిర్వ‌హ‌ణలో వాళ్లు అంత‌కు మించి చేసేదేముండ‌దు.

కానీ ఆంధ్ర పోలీసులైతే మ‌రీ డేంజ‌ర్ బాసు.. ఎలా తెలుసంటారా? ఇగో ఈ బోసిడీకే.. ప‌ట్టాబీ రామ్ .. అదేనండి.. బోసిడికే అని తిట్టి ఫేమ‌స్ అయ్యాడు క‌దా టీడీపీ లీడ‌ర్ ప‌ట్టాభిరామ్‌.. పోలీసు స్టేష‌న్‌కు వెళ్లే ముందు ఎలా త‌న అంగాగ ప్ర‌ద‌ర్శ‌న వీడియో చేసి మీడియాకు వ‌దిలివెళ్లాడో.. అదీ తెలివంటే. అదీ పోలీసుల‌ను ఎదుర్కోవ‌డ‌మంటే… అదీ ద‌మ్మంటే. ఇలా చేయాలి మ‌న‌మంతా ద‌మ్ముంటే. అప్పుడు పోలీసులు మ‌ననేమీ చేయ‌లేరు. బోసిడీకే అని తిట్టి పంపించ‌డం త‌ప్ప‌.