ఎప్పుడో జరగాల్సిన టీఆరెస్ జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం లేట్ కావడానికి కారణం.. సీఎ కేసీఆరే స్వయంగా వీటిని పర్యవేక్షిస్తుండటం. జిల్లాల వారీగా ఎవరిని అధ్యక్షులని చేయాలో స్థానిక నేతల నుంచి సమాచారం అంతా వచ్చింది. పేర్ల లిస్టు సీఎం వద్దకు చేరింది. ఇప్పుడా ఫైల్ ఆయన దగ్గరే ఉంది. హుజురాబాద్ ఎన్నికలు, 25 ప్లీనరీ .. ఇవన్నీ ఉన్న సమయంలో ఇప్పుడప్పుడే వీటిని ప్రకటించేలా లేడు సీఎం కేసీఆర్. అయితే ఏ జిల్లాకు ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలో లోతుగా ఆలోచిస్తున్నాడు కేసీఆర్.
రాబోయే ఎన్నికలు టీఆరెస్ పార్టీకి చాలా కీలకం. ఎమ్మెల్యేల పై నమ్మకం సన్నగిల్లింది. వ్యతిరేక భావన పెరిగింది. ఇలాంటి సమయంలో పార్టీ అధ్యక్షుడు వీటిని సమన్వయం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు రిపోర్టు పంపాలి.జిల్లాలో ఏది జరిగినా.. వెంటనే అధిష్ఠానానికి సమాచారం ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మంచి గట్స్ ఉన్న నాయకుడు కావాలి. సందర్భానుసారంగా స్పందించే నేత కావాలి. కేసీఆర్కు అన్ని జిల్లాల లీడర్లపై సరైన సమాచారం ఉంది. ఆశావాహులపైనా పట్టు ఉంది. ఎవరికి ఇవ్వాలనేదిపై క్లారిటీ ఉంది.
సామాజిక సమీకరణలుకూడా చూస్తున్నాడు. ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గానికి ఇస్తే మేలు జరుగుతుంది. వారెంత వరకు ఎమ్మెల్యేలను, పార్టీని సమన్వయం చేసుకుంటూ వస్తారు..? అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాడు సీఎం కేసీఆర్. ఈ నెల 25న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం అయిన తర్వాత ప్లీనరీ ముగిసిన తర్వాత … ప్రెసిడెంట్ల పేర్లపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నాడు. నవంబర్ 15న భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆలోపు ఈ ప్రసిడెంట్ల నియామకంపై కేసాఆర్ క్లారటీ ఇవ్వనున్నాడు.