స‌రిత పీట్ల‌. తెలంగాణ యూనివ‌ర్సిటీ మాస్ క‌మ్యూనికేష‌న్ విభాగం ప‌రిశోధక విద్యార్థిని. మ‌హిళ‌ల‌పై టీవీ సీరియ‌ల్స్ ప్ర‌భావం- నిజామాబాద్ జిల్లా ప‌రిధి- ఒక అధ్య‌య‌నం అనే అంశంపై పీహెచ్‌డీ చేసింది. ఈ టాపిక్ తీసుకున్న‌ప్పుడు అంద‌రూ న‌వ్వారు. ఇదేందీ ఇదేం అంశం.. ప‌రిశోధ‌న చేయ‌డానికి అనుకున్నారు. కానీ ఇప్పుడు చాలా మంది మ‌గ‌వాళ్లు… ఈమె చేసిన పీహెచ్‌డీ చేసిన అంశాన్ని మెచ్చుకుంటున్నారు. ఓ బుక్కే తీయండి.. మాకు చాలా ప‌నికి వ‌స్తుంది. మా టీవీ సీరియ‌ళ్ల‌తో బ‌త‌క‌లేక‌పోతున్నామ‌ని అని కూడా అంటున్నార‌ట‌.

-టీవీ సీరియ‌ళ్లు మ‌హిళ‌ల‌పై ఎంత‌టి విష ప్ర‌భావాన్ని చూపుతున్నాయ‌నే కోణంలో స‌మాజానికి తెలియ‌జెప్ప‌టానికి ఈ అంశాన్ని ఎంచుకున్న‌ద‌ట స‌రిత‌. సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు దీనికే ప‌రిమిత‌మ‌యి.. పిల్ల‌ల‌కు తిండి కూడా కొంద‌రు పెట్ట‌డం లేద‌ట‌.

– బీర్కూర్ మండ‌లంలో రిమోట్ కోసం కొట్లాడి ఓ మామ అల్లుడిని క‌త్తితో పొడిచి చంపిన ఘ‌ట‌న కూడా ఈ టాపిక్‌ను ఎంచుకోవ‌డానికి కార‌ణ‌మంటున్న‌ది ఆమె. మ‌హిళ‌ల ఏజ్ గ్రూపుల‌ను 4 విభాలుగా విభ‌జించి వారితో నేరుగా ఇంట‌ర్వూలు తీసుకుని విష‌య సేక‌ర‌ణ ఛేసింది.

– నాలుగు టీవీలు.. మా టీవీ, ఈటీవీ, జెమినీ, జీ తెలుగు .. వీటిలో వ‌చ్చే టీవీ సీరియ‌ళ్ల‌పై ఆమె ప‌రిశోధ‌న చేసింది. ఒక్కో టీవీలో వ‌చ్చే 5 సీరియ‌ళ్ల చొప్పున మొత్తం 20 సీరియ‌ళ్ల ప్ర‌భావం ఎలా ఉందో ఆరా తీసింది.
– చాలా మంది మ‌హిళ‌లు ఇళ్ల‌లో అంద‌రూ వెళ్లిపోయిన త‌ర్వాత ఒంట‌రి జీవితం గ‌డుపుతున్నారు. ఆ స‌మ‌యంలో ఈ టీవీలే వారికి నేస్తాలు. టైమ్ పాస్ కోసం, కొంత ఉప‌శ‌మ‌నం కోసం దీనిని ఎంచుకుని, ఆఖ‌రికి ఇవి లేన‌దే బ‌త‌క‌లేని ప‌రిస్థితికి వ‌చ్చారంట మ‌హిళ‌లు. ఆఖ‌రికి బెడ్‌రూంలోకి కూడా టీవీలు వ‌చ్చేశాయి. ఎవ‌రికి న‌చ్చిన టీవీ సీరియ‌ల్ వాళ్లు చూసేందుకు.

– ఆ టీవీ సీరియ‌ళ్ల‌లో వ‌చ్చే వేష‌ధార‌ణ‌, సంస్కృతిన మ‌న‌వాళ్లు అనుక‌రిస్తున్నార‌ట‌. అలాగే ఉండేందుకు వాటిని ఓన్ చేసుకుంటున్నార‌ట‌. అందులోని త‌ళుకుబెళుకుల‌కు అట్రాక్ట్ అవుతున్నార‌ట‌.
-ప‌ల్లెటూరి మ‌హిళ‌లు మ‌రీ అమాయ‌కులు. కార్తీక‌దీపంలో వ‌చ్చే అన్నీ బాధ‌లు త‌మ‌వేన‌ని భావిస్తార‌ట‌. ఏ ప‌నిచేసినా.. వాళ్ల మెద‌ళ్ల‌లో ఈ టీవీ సీరియ‌ల్ బాధ‌లే. మ‌ళ్లీ కొత్త ఎపిసోడ్ వ‌చ్చే వ‌ర‌కు. వాటిని చూసే వ‌ర‌కు.

– బిగ్‌బాస్ లాంటి చెత్త రియాలిటీ షోలు, చెత్త సీరియ‌ళ్ల ప్ర‌సారం క‌న్నా అమీర్‌ఖాన్ స‌త్య‌మేవ జ‌య‌తే లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సీరియ‌ళ్లు చేస్తే బాగుంటుంద‌ని, టీవీ సీరియ‌ళ్ల‌కూ సెన్సార్ బోర్డు ఉండాల‌నీ అంటున్న‌ది స‌రిత‌.

https://youtu.be/JJL42OGy8Dc

You missed