ప్రభుత్వ పాఠశాలలు కిటకిటలాడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వచ్చిపోయిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. చేసేందుకు పనులు లేవు. కట్టేందుకు ఫీజులు లేవు. ఆన్‌లైన్ అరొకర క్లాసుల నడుమ కూడా ఫీజులు గుంజుతూనే ఉన్నారు. ఇక ఈ ఫీజులు కట్టలేమని సర్కారు స్కూళ్ల వైపు వెళ్లారు తల్లిదండ్రులు. బతికుంటే బలుసాకు తినొచ్చన్నట్టు.. ఇప్పటి పరిస్థితుల్లో ఏదో ఒ క స్కూలు..అని సరిపెట్టకుంటున్నారు. దీంతో ప్రైవేటు అడ్మిషన్లు పూర్తిగా తగ్గిపోయాయి. సర్కారు బడుల్లో లిమిట్‌ను మించి మరీ అడ్మిషన్లు వచ్చాయి. క్లాసుకు 40 మంది ఉండాల్సి ఉండగా.. 60-80 మంది పిల్లల వరకు వచ్చి కూర్చున్నారు. ఇక అడ్మిషన్లు తీసుకోబోము బాబు.. అని సర్కారు స్కూల్ ప్రధానోపాధ్యాయులు అని చెప్పే వరకు పరిస్థితి వెళ్లిందంటే … సీన్ ఎంతలా రివర్స్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.