హుజురాబాద్ ఎన్నికలేమో గానీ గెలుపు కోసం ఎంతటికైనా దిగజారేందుకు సిద్దమవుతున్నది అధికార పార్టీ. ఇప్పటికే ఇక్కడ పెట్టే శ్రద్ధ, అనవసర ఖర్చు, హంగామా.. అన్నీ ప్రజల ముందు పార్టీ పట్ల చిన్నచూపు చూసేలా చేస్తన్నవి. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న టీఆరెస్ సోషల్ మీడియా.. మళ్లీ ఫేక్ వార్తలతో ఈటల రాజేందర్‌ను నైతికంగా దెబ్బకొట్టేందుకు రెడీ అయ్యింది. ఇవాళ ఇలా షెడ్యూల్ విడుదలైందో లేదో.. అలా ఓ ఫేక్ న్యూస్‌ను విడుదల చేశారు సోషల్ మీడియాలో. ఈటల రాజేందర్ ఎన్నికల కమిషన్‌ను దళితబంధు ఆపేయాలని, సెంట్రల్ ఫోర్స్ పెట్లాలని, ఇక్కడ పోలీసులపై నమ్మకం లేదని ఏదేదో ఉంది అందులో.
అధికార పార్టీ ఇప్పటికే హుజురాబాద్‌లో ఏమేమీ చేయాలో అన్నీ చేసింది. మూడు నాలుగు నెలలుగా అక్కడ పరిస్థితి అంతా తన ఆధీనంలోకి తీసుకున్నది. ఈటల రాజేందర్‌ను అన్ని రకాలుగా దెబ్బ కొట్టింది. ఇప్పడు కొత్తగా మళ్లీ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి సాధించేదేముంటుంది? ప్రజల వద్ద నవ్వుల పాలు కావడం తప్ప. ఇది ఫేక్ అని తెలిసి చేస్తున్నారో? తెలియక చేస్తున్నారో కానీ దీన్ని తీసుకుని మరి కొంత మంది ఈటలను ఇష్టమొచ్చినట్టు తూలనాడుతూ మళ్లీ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంకా మున్ముందు ఎన్ని చూడాల్సి ఉంటుందో కదా ఎన్నికలై పోయేనాటికి.