పదమూడేళ్ల బాలిక. పేరు బొర్రా శ్రీవేదా రెడ్డి. నిర్మల్‌లోని వాసవీ హై స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఏడేండ్ల నుంచే హిందీ సినిమాలు చూడటం అలవాటు. మొన్నటి లాక్‌డౌన్ లో మరిన్ని సినిమాలు చూసే అవకాశం లభించింది. ఏ సినిమా చూసినా.. అందులో వర్ణవివక్షత స్పష్టంగా కనిపించేలా సినిమాలున్నాయనే విషయం ఆ చిన్ని మనస్సు గమనించింది. హీరోయిన్ అంటే తెల్లగా ఉండాలి. అలా ఉంటేనే అందం. నలుపు అంటే అదో వికారం. అలా ఉండటం శాపం. వారికి సమాజంలో చోటులేదు. వాళ్లు మనుషులే కాదు.. అనే విధంగా పాటలు, మాటలు. పైత్యాలు. వికారాలు. జాత్యాంహంకారాలు. ఏ సినిమా చూసినా ఇదే పాయింట్‌ను తరుచూ పట్టుకునేది వేద.
ఇదే కోణంలో సినిమాలు చూడటం మొదలు పెట్టింది. ఏ సినిమా చూసినా ఏ ముంది గర్వకారణం అన్నట్టు.. కుల వివక్ష, వర్ణ వివక్ష అన్నీ కనిపిస్తున్నాయి. కొత్త తరం ఎవరు ఇలాంటి సినిమాలు చూసినా.. నలుపు రంగు మనుషులను ఈసడించుకునేలా, తెలుపంటే అందం అన్నట్టుగా వారే మనుషలన్నట్టుగా అభివర్ణించే బాలీవుడ్ సినీ వైఖరిని ఈ బాలిక వాలీబాల్ ఆడేసుకున్నది. ఇటీవలే ఓ బ్లాగ్ క్రియేట్ చేసింది. దాని పేరు ఎక్విటాటిస్. ఈ లాటిన్ పదానికి అర్థం న్యాయం. ఆ బ్లాగ్‌లో ఈ బాలీవుడ్ వికృత జాత్యాంహకార పెడదోరణులను తన చిన్న మనస్సుతో పసిగట్టినవి తనకు తోచిన విధంగా చెప్పింది. ఆలోచింపజేసే విధంగానే ఉంది శైలి. కొంచెం పెద్దగా ఉన్నా.. కంటెంట్ బాగుంది. ఓ లుక్కేయండి. చిన్నారికి బెస్టాఫ్ లక్ చెప్పండి.
https://theaequitatis.blogspot.com/2021/09/bollywood-and-racism.html?m=1