కరోనా వ్యాక్సిన్ల కోసం పీహెచ్‌సీల ముందు, అర్బన్ హెల్త్ సెంటర్ల ముందు పడిగాపులు కాసే జనాలను చూసినం. వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు బారులు తీరిక కనిపిస్తున్నారు. కొందరైతే వాపస్ వెళ్లిపోతున్నారు.దవఖానల్లో సిబ్బంది చీదరింపులు,నిర్లక్ష్యం అదనంగా ఉండనే ఉంటాయి. ఇవన్నీ భరిస్తూ కూడా రోజు ఇక్కడ వ్యాక్సిన్ల కోసం తండ్లాట కామన్‌గా మారింది. ఈ వీడియో ఒకసారి చూడండి. ఎక్కడితో తెలియదు. కానీ నర్సులంతా కలిసి ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. వ్యాక్సిన్లు వేయించుకోండమన్నా..! అని మర్యాద పూర్వకంగా వారి వద్దకే వెళ్లి అడిగి మరీ వేస్తున్నారు. సర్కారు వైద్యమంటే ఇలా ఉండాలి. అప్పుడే కదా వీరి మీద నమ్మకం పెరిగేది.