వినాయకచవితికి ఐదో రోజున లక్ష్మీ పూజలు చేయడం కొన్ని చోట్ల ఆనవాయితీ. మహారాష్ట్ర నుంచి ఈ కల్చర్ వచ్చింది. నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ సంస్కృతి బాగా ఉంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిర పడ్డ వారు నిష్టగా లక్ష్మీ పూజలు చేస్తారు. లక్ష్మీదేవీ కటాక్షించి ధనప్రాప్తి కలిగజేయాలని ఈ పూజలు చేస్తుంటారు. రెండు లక్ష్మీ దేవత విగ్రహాలకు చీరతో కట్టి అలంకరిస్తారు. అన్ని రకాల పిండివంటలు చేస్తారు. లక్ష్మీదేవీకి ఇద్దరు సంతానం. ఓ కొడుకు, ఓ కూతరు. వీరిని కూడా పక్కనే ప్రతిష్టించి… ముస్తాబు చేస్తారు. కొందరు ఇరుగుపొరుగును పిలిచి .. పసుపు కుంకుమలు కూడా ఇస్తారు. ఇంకొందరు భోజనాలు పెడతారు. వినాయకచవితి ఐదో రోజున ఈ పూజలు చేసి.. తర్వాత రోజు సాయంత్రం వరకు తీసేస్తారు. ఇలా ప్రతీ ఏడాది లక్ష్మీపూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. మహారాష్ట్ర నుంచి వచ్చి స్థిరపడినవారే కాకుండా కొంతమంది ఇక్కడి వాళ్లు కూడా ఈ పూజలను ఈరోజు చేస్తారు.