ఆరేళ్ల చిన్నారి. అభం శుభం ఎరుగని చందమామ. చుట్టూ ఉన్న సమాజంలో కౄరజంతువుంటాయనే కనీస జ్ఞానం కూడా లేని అమ్మాయి. దారుణంగా రేప్ చేయబడి.. హత్య గావింపబడి… ఘోరాతిఘోరం. ఆడపిల్లగా పుట్టిన పాపానికి మృగాళ్ల సమాజం ఆ చిన్నారికి వేసిన మరణశిక్ష ఇది. యావత్ సమాజం తలదించుకునేలా, సిగ్గుపడేలా … మన రాజధానిలో చోటు చేసుకున్న ఈ దారుణం చూసి కంటతడి పెట్టని వారుండరు. హృదయం ద్రవించని మనిషుండడు. కోపంతో రగిలిపోయే మనసుండదు.