కేటీఆర్ రెండు నెల‌లుగా ఎవ‌రినీ క‌ల‌వ‌డం లేదు. ఎవ‌రికీ స‌మ‌యం కేటాయించ‌డం లేదు. అడ్మినిస్ట్రేష‌న్‌లో ఆయ‌న ఇన్‌వాల్వ్‌మెంట్ పూర్తిగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. ఎందుకు? కార‌ణాలేంటీ??

ఇప్పుడు అధికార‌వ‌ర్గాల్లో, ఉద్యోగ సంఘాల నేత‌ల్లో ఇదే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. గ‌తంలో కేటీఆర్‌ను క‌ల‌వాలంటే సులువుగా జ‌రిగేది. ఏదైనా కీలక అంశం చ‌ర్చించాలంటే స‌మ‌యం ఇచ్చేవాడు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వినేవాడు. వెంట‌నే ప‌క్క‌నే ఉన్న ఉన్న‌తాధికారుల‌కు త‌న‌వంతుగా ఆదేశాలిచ్చేవాడు. ఆ స‌మ‌స్య‌లను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని చెప్పేవాడు. ఇదంతా ఒకప్ప‌టి మాట‌. ఇప్పుడు కేటీఆర్ ఎవ‌రికీ చిక్క‌డం లేదు. ఎవ‌రితో క‌ల‌వ‌డం లేదు. త‌నదాకా వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎందుకు?

త‌ను చెప్పిన ప‌నులు కావ‌డం లేద‌నే అసంతృప్తితో ఉండ‌టం వ‌ల్లే కేటీఆర్ ఎవ‌రినీ క‌ల‌వ‌డం లేద‌ని, ఉన్న‌తాధికారుల‌పై గుర్రుగా ఉన్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. గ‌తంలో ప‌లువురితో భేటీ సంద‌ర్భంగా కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలు బుట్ట‌దాఖ‌కావ‌డంతో కేటీఆర్‌లో తీవ్ర అసంతృప్తికి కార‌ణంగా చెప్పుకుంటున్నారు. త‌న‌ను న‌మ్ముకుని వ‌చ్చిన‌వారి ప‌నులు కాన‌ప్పుడు.. ఇక ఎవ‌రినీ క‌ల‌వ‌డం ఎందుకు? అధికారుల‌కు ఆదేశాలిచ్చుడెందుకు? అనే అసంతృప్త దోర‌ణిలో కేటీఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో చాలా మంది కేటీఆర్ అపాయింట్‌మెంట్ దొర‌క‌క‌.. హైద‌రాబాద్ చుట్టూ తిరుగుతున్నార‌ట‌. చివ‌ర‌కు సీఎస్‌ను క‌లిసి ఏదో త‌న గోడు వెళ్ల‌బోసుకుంటున్నార‌ట‌. ఆయ‌న ష‌రా మామూలుగానే.. ఆ.. స‌రే .. సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా.. ఓకే.. ఓకే.. అని వెళ్ల‌గొడుతున్నాడ‌ట‌.

You missed