గాయం సినిమాలో…….

నిగ్గ‌దీసి అడుగు ఈ సిగ్గులేని జ‌నాన్ని
అగ్గితోటి క‌డుగు ఈ స‌మాజ జీవ‌చ్చ‌వాన్ని

మార‌దు లోకం…మార‌దు కాలం…
దేవ‌డు దిగిరాని ఎవ్వ‌రు ఏమైపోనీ.. మార‌దు లోకం.. మార‌దు కాలం..

సింధూరంలో..

అర్ధ‌శ‌తాబ్ద‌పు అజ్జానాన్నే స్వతంత్ర‌మందామా?
స్వ‌ర్ణోత్స‌వాలు చేద్దామా? ఆత్మ వినాశపు అరాచ‌కాన్ని స్వ‌రాజ్య‌మందామా? దానికి స‌లాము చేద్దామా?

సిరివెన్నెల రాసిన పాట‌ల మాదిరిగానే సాగిందాయ‌న స్పీచ్‌. ఇటీవ‌ల స్వాత్రంత్య వేడుక‌ల్లో నేష‌న‌లిస్ట్ హ‌బ్ అనే చానెల్‌లో మాట్లాడాడు. అప్ప‌టికీ ఇప్ప‌టికీ దేశంలో ప‌రిస్థితులు మార‌లేద‌ని, మ‌రీ అధ్వాన్నంగా మారాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అప్ప‌డు కులాలున్నాయి కానీ క‌ల‌హాలు లేవ‌న్నాడు. ఇప్పుడు క‌ల‌హాలున్నాయి కానీ కులాలు లేవ‌న్నాడు. అప్పుడూ ఇప్పుడూ తెగువ‌గల వాళ్లే పోరాటం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు కానీ చాలా మంది ప్ర‌జ‌లు త‌మాషా చూస్తున్నార‌ని ఆయ‌న వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మ‌రోవైపు దేశం భ‌క్తి, ఆథ్యాత్మికం ముసుగులో డ్ర‌గ్స్‌కు బానిసైన వారిలా త‌యారైంద‌న్నాడు. కులాల కోసం గుంపులు క‌ట్టేవారి కోసం.. మ‌తాల కోసం మంట‌లు పెట్టే వారికోసం ఎందుకు పోరాటం చేయాల‌ని ప్ర‌శ్నించాడు. చెడి రాజ‌కీయాల గురించి తూర్బార‌బ‌ట్టాడు. మీడియా వ్యాపారాల పెడ‌దోర‌ణున‌ల‌ను ఎండ‌గ‌ట్టాడు. హిందువుల‌మ‌ని చెప్పుకునేందుకే భ‌య‌ప‌డే రోజులొచ్చాయ‌ని, టీవీ9లో దేవుళ్ల‌ను వ‌క్రీక‌రించి చూపిస్తే దాన్ని బ‌హిష్క‌రించామ‌ని,ఇదే దేశ‌భ‌క్తి అన్నాడు. దేశం ప‌ట్ల ఉపేక్షే మిగిలింద‌ని, ఆపేక్ష లేద‌న్నాడు. దేశ‌భ‌క్తి అనేది ఓ బూతుప‌దంగా మారింద‌ని అభివ‌ర్ణించాడు

ఆయ‌న పూర్తి వీడియో..

You missed