పిట్ట‌ల శ్రీ‌కాంత్ ముదిరాజ్‌. ఇత‌ని పేరు మీద ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంది. ఇత‌నో జ‌ర్న‌లిస్టు. న‌మ‌స్తే తెలంగాణ‌లో కొత్త ఎడిట‌ర్ తీగుళ్ల కృష్ణ‌మూర్తి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన దారుణాలు, ఉద్యోగులు జీతాలు పీకేసీ రోడ్డున ప‌డేసిన వైనాల‌ను ఎండ‌గ‌డుతూ , సీఎంపై ప్ర‌శ్న‌ల అస్త్ర‌శ‌స్త్రాల‌ను సంధిస్తున్నాడు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.

వాస్త‌వం వెబ్‌సైట్‌లో న‌మ‌స్తే తెలంగాణ‌లో జ‌రుగుతున్న విష‌యాల‌ను వ‌రుస క‌థ‌నాల‌తో ముందుంచింది. దాదాపుగా ఇవే అంశాల‌ను పిట్ట‌ల శ్రీ‌కాంత్ ముదిరాజ్ త‌న ఎఫ్‌బీ వాల్ పై రోజుకొక విష‌యాన్ని చెబుతూ.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాడు. ఎస్జీవీ శ్రీ‌నివాస్ రావు, ఓరుగంటి స‌తీశ్‌, తీగుళ్ల కృష్ణ‌మూర్తి ఈ ముగ్గురు క‌లిసి పత్రిక‌ను నాశనం చేస్తున్నార‌ని సీఎంకు తాజాగా మొర‌పెట్టుకున్నాడు. ద‌ళిత‌బంధు ప్ర‌వేశ‌పెట్టి ద‌ళితుల పై ప్రేమ చూపిస్తున్న సీఎం త‌న ప‌త్రిక‌లోనే ఎడిట‌ర్, మిగిలిన ఇద్ద‌రు ఎస్సీల‌ను దారుణంగా తీసేసి వాళ్ల బ‌తుకుల‌తో ఆడుకుంటుంటే క‌నిపించ‌డం లేదా? అని నిల‌దీశాడు.

ఉద్యోగాలు పోయిన వారి ఉసురు మీకు త‌గులుతుంద‌ని, కుక్క చావు చ‌స్తార‌ని శాప‌నార్ధాలు పెట్టాడు. క‌రోనా వేళ ఉద్యోగుల‌ను తీసేసి భారం త‌గ్గించుకున్నామ‌ని చెబుతున్న వీరు కొత్త కార్ల‌కు డ‌బ్బులు ఎలా వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించాడు. న‌మ్ముకున్న ప‌త్రిక‌లో బ‌తుకులు బ‌జారు పాలై రోడ్డున ప‌డ్డామ‌ని, దిశ వెబ్ న్యూస్ వారిని ఆదుకున్న‌ద‌ని చెప్పాడు. మ‌మ్ముల్ని ప‌నికిరామ‌ని పీకేసిన వారికీ, దిశ‌లో ప‌నిచేస్తూ మేము ఈ ప‌త్రిక‌ను ఈనాడుకు మించి ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని, ఇదే వీరికి గుణ‌పాఠ‌మ‌ని అన్నాడు. కులం రొచ్చులో ప‌డి ఎవ‌డి కుల‌స్తుడిని వాడు తెచ్చిపెట్టుకుని, ల‌క్ష‌ల జీతాలు ఇచ్చుకుంటున్నాడ‌ని, బ‌క్క ఉద్యోగుల బ‌తుకులు బ‌జారుపాలు చేసి బ‌లిసిన కొడుకులు రాజ్య‌మేలుతున్నార‌ని దుయ్యాబ‌ట్టారు.

‘న‌మ‌స్తే’ను న‌మ్ముకున్న‌వాళ్ల‌ను న‌ట్టేట ముంచి…క‌రోనా క‌న్నా క‌ర్క‌శం ఈ కృ.తి… https://vastavam.in/2021/08/09/state-news/p=988/

ఉద్యోగం పోతుంద‌నే భ‌య‌మే నాగ‌రాజు ప్రాణం మింగింది. దీనికి కార‌కులెవ‌రు కృ.తి.? https://vastavam.in/2021/08/15/state-news/p=1148/

చీమ‌లు పెట్టిన పుట్ట‌లో పాములు…. https://vastavam.in/2021/08/07/state-news/p=937/

“న‌మ‌స్తే”లో మూడు కుర్చీలాట‌.. https://vastavam.in/2021/08/08/off-the-record/p=972/

కేటీఆర్ గారు..! మీ ప‌త్రిక‌లోనే వంద‌ల మంది రోడ్డున ప‌డ్డారు… https://vastavam.in/2021/08/10/state-news/p=1020/

‘న‌మ‌స్తే’కు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గుడ్‌బై… ఎడిట‌ర్ వైఖ‌రి.. ప‌త్రిక దుస్థితిపై అసంతృప్తి https://vastavam.in/2021/08/12/state-news/p=1066/

You missed