ఓ మైనంప‌ల్లి, ఓ మంత్రి మ‌ల్లారెడ్డి … వీళ్లిద్ద‌రూ లేక‌పోతే టీఆరెస్ పార్టీ ఏమౌపోవు? మ‌న పార్టీ గౌర‌వ మ‌ర్యాద‌లు గంగ‌లో క‌లిపేవిధంగా మాట్లాడుతున్ననేత‌ల‌ను బ‌రిగీసి స‌వాల్ విసిరి, తొడ‌లుకొట్టేందుకు ఒక్క‌డ‌న్నా ముందుకు వ‌చ్చిండా? రాలే. మ‌న కేసీఆర్ ను ఆడూ ఈడూ అంతంత మాట‌లంటుంటే.. ఒక్క‌డంటే ఒక్క‌డు ముందుకు వ‌చ్చి సాలే .. గాండూ అన్న‌డా? అన్లే.

రేవంత్‌రెడ్డి, తీన్మార్ మ‌ల్ల‌న్న‌, బండిసంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్‌.. అబ్బ‌బ్బ ఎంత మంది మ‌న నేత‌ను తిడుతుంటే వ‌చ్చి ఒక్క‌డంటే ఒక్క‌డు మాట్లాడిండా..?

మంత్రి మ‌ల్లారెడ్డి ఉన్న‌డు కాబ‌ట్టి స‌రిపోయింది. మైనంప‌ల్లి వ‌చ్చి రెచ్చిపోయాడు కాబ‌ట్టి మానం కాపాడ‌బ‌డింది. మ‌ల్లారెడ్డికి మంత్రి ప‌ద‌వి ఎందుకిచ్చిండ్రు అని అప్పుడు అంతా తిట్టినోళ్లే.. ఇప్పుడు సూసిండ్రా.. స‌మ‌యం, సంద‌ర్భం చూసి ఎలా త‌న రుణం తీర్చుకుంటున్నాడో.. ఇలాంటి మంత్రులు మ‌న‌కు కావాలె. కేసీఆర్ మంచి నిర్ణ‌యం తీసుకున్నాడు. మ‌ల్లారెడ్డిని మంత్రిని చేసిండు. న‌వ్విపియ్యాల‌న్నా… భారీ డైలాగులు కొట్టి బాల‌య్య‌ను మ‌రిపించాల‌న్నా మ‌న మ‌ల్లారెడ్డే. మైనంప‌ల్లిని కూడా మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాలి. ప‌నిలోప‌ని మొన్న ఆర్మూర్ జీవ‌న్‌రెడ్డి కూడా బ‌ట్ట‌లిప్పించి రోడ్డు మీద తిప్పుతా అని ప‌వ‌ర్ పుల్ డైలాగ్ కొట్టిండు.. ఆయ‌న‌నూ మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాలె.

ఇప్పుడున్న రాజకీయాల్లో ఇసొంటి మంత్రులు లేక‌పోతే … మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోలెం. ఆళ్లు ప‌ది తిడితే మ‌నం వంద తిట్టాలె. ఆళ్లు అంగి ఇప్పేసుకుంటే.. మ‌నం అంగీలాగూ ఇప్పేసుకోవాలె. అప్పుడే మ‌న‌తో పెట్టుకునేందుకు సిగ్గుప‌డి, భ‌య‌ప‌డి పారిపోత‌రు కొడుకులు…

ఏమంట‌వే.. అంతేనా..?

You missed