స్త్రీ, పురుషునిపై ఆధారపడే పరిస్థితి మారాలి !
••••••••••••••••••••••••••••••••••••••••••
భారత దేశంలో స్త్రీ తన తోబుట్టువు లైన అన్న తమ్ముల్లకి , వరసకి అన్న తమ్ముడు అయిన వారికి, లేదా ఆమె తన అన్న లేదా తమ్ముడుగా భావించిన వారికి… ‘నేను ఆపదలో ఉన్నప్పుడు లేదా అవసరం అయినప్పుడు తోడుగా ఉండమని రక్షించమని బ్యాక్ సపోర్ట్ ఇవ్వమని’ ప్రతీ సంవత్సరం రాఖీ కడుతుంది.

అంటే ఈ దేశం లో ఇంకా స్త్రీలకి రక్షణ లేదు అనేగా అర్థం!

ఈ దేశం లో స్త్రీలు ఇంకా తమ అవసరాలకు, రక్షణకి మగ వాళ్లపై ఆధారపడే బలహీనులు అనేగా అర్థం!!

మన దేశం లో స్త్రీలు ఇంకా బలహీనులు గా ఉండటానికి ప్రతీ విషయం లో మగవారి పై ఆధార పడటానికి కారణం ఏమై ఉంటుంది?

అనాదిగా స్త్రీలని సాంప్రదాయం, సంస్కృతి అంటూ కంచు కంచే లో బందిస్తున్నారు.

ఈ దేశం లో ….👇🏼
-ఆడ దాన్ని చెరచిన ఇంద్రుడు దేవతలకి రాజు అయ్యాడు..

– ఆడ పిల్లల మానాలని బలవంతంగా చూసిన కృష్ణుడు దేవుడు అయ్యాడు…

– ఆడ దాని ముక్కు చెవులు కోపించి, భార్య శీల పరీక్ష చేయించి , గర్భవతియైళ భార్యని అడవులకు పంపిన రాముడు ఆరాధ్యుడు అయ్యాడు..

– ఒక భార్య వుండగానే మరో ఆడ దాన్ని తెచ్చి పెట్టుకున్న శివుడు, వేంకటేశ్వర స్వామి లు దైవాలు అయ్యారు..
– ఒకే స్త్రీ నీ ఐదుగురు పంచుకొని చివరికి ఆమెను జూదం లో పెట్టి ఓడిన పాండవులు వీరులు అయ్యారు.

ఈ దేశం లో స్త్రీ నీ పిల్లలని కనే యంత్రంలా , పడక సుఖాన్ని ఇచ్చే పడతిగానే చూసారు తప్ప… ఏ రోజు ఆమెను మనిషిగా గౌరవించ లేదు. తనని పురుషునితో సమానంగా చూడలేదు.

‘రాముడు వశిష్టుడి దగ్గర విశ్వామిత్రుడి దగ్గర శిష్యరికం చేశాడు’ అని ఉంటుందే తప్ప ‘సీతా దేవి ఫలానా గురువు దగ్గర విద్యాభ్యాసం చేసింది’ అని ఉండదు.

‘కృష్ణుడు సాందీపని ఆశ్రమం లో చదివాడు’ అని ఉంటుంది కానీ ‘రుక్మిణి ఫలానా ఆశ్రమంలో విద్య నేర్చుకుంది’ అని కనబడదు.

‘పాండవులు ద్రోణాచార్యుని దగ్గర యుద్ద విద్యలు అభ్యసించారు’ అని ఉంటుంది కానీ ‘ద్రౌపది ఫలానా గురువు దగ్గర విద్య నేర్చింది’ అని ఉండదు.

‘అనాదిగా ‘స్త్రీలని విద్యకు దూరం చేశారు., పాలన కి దూరం చేశారు.,
సంపాదనకూ దూరం చేశారు.’

కొన్ని వేల సంవత్సరా లుగా ఇక్కడ ఆడ వారిని అనచివేశారు.

రాణి రుద్రమ దేవి, ఝాన్సి లక్ష్మి భాయి , జల్కరి భాయి వంటి వారు దైర్యం చేసి పాలన చేద్దాం అనుకుంటే.. అవమానించి, అణచి వేసి, కుట్రలు చేసి చంపారు. (కానీ ఈ రోజు వీర వనితలు అని పొగుడుతున్నారు)

👉ఈ దేశం లో మహాత్మా జ్యోతిబా పూలే , సావిత్రి భాయి ఫూలే ల పోరాటాల వల్ల , వారి కృషి ఫలితంగా 1884 నుండి స్త్రీలకి విద్య నేర్పడానికి బీజాలు పడ్డాయి.

👉 ఈ దేశం లో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం వల్ల, త్యాగాల వల్ల స్త్రీలకి 8 వారాల ప్రసూతి సెలవులు, పురుషునితో సమానంగా ఉద్యోగావకాశాలు, వేతనాలు, ఆస్తిలో సమాన వాటా ఇంకా ఎన్నో హక్కులు వచ్చాయి.

మహాత్మా ఫూలే అంబేడ్కర్ గార్ల త్యాగాల వల్ల , పోరా టాల వల్ల , వారి కృషి ఫలితంగా ఈ నాడు ఆడ వారు టీచర్ లుగా, పోలీస్ లుగా, Doctorsగా, Engineersగా, Pilotsగా ఇంకా ఎన్నెన్నో రకాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. పార్లమెంట్ కు , Assembly కి , ఇతర స్థానిక సంస్థలకు
ఎన్నికై… దేశాన్ని , రాష్ట్రాలను స్థానిక సంస్థలను పాలిస్తున్నారు.

దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశం లో స్త్రీలు తమను అవమానాలకు అణచివేతకు గురి చేసిన వారిని పూజిస్తుంటారు..

తమ కోసం అవమానాలను భరించి హక్కులను ప్రసాదించి స్వేచ్ఛను ఇచ్చి మనిషిగా గుర్తింపు తెచ్చిన వారిని అస్సలే పట్టించు కోరు.

ఈ దేశం లో మగవాడు అడ్డమైన ఎన్ని గొడలైన దూకవచ్చు.. కానీ ఆడది గడప దాటడానికి వీలు లేదు.

ఈ దేశం లో మగ వాడు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. ఎన్ని అక్రమ సంబందాలైన నడపవచ్చు, కానీ ఆడది మగవాని వైపు కన్నెత్తి చూసినా, కాస్త చనువుగా మాట్లాడినా భరితెగించింది అంటారు.

ఆడది ఒంటరిగా బయటకు రావడమే భయం కొన్ని వేల కామపు చూపుల మద్య వెళ్లాల్సి ఉంటుంది.
ఈ దేశం లో ఆడది అంటే కేవలం లైంగిక కోరికలు తీర్చే ఒక ఆట బొమ్మనే !

ఆడ వారికి ఈ దేశం లో ఎప్పుడూ ఎక్కడ సరియైన గౌరవం లభించింది లేదు.

ఎవరినైన తిట్టా లి అంటే…
నీ అమ్మని డ్యా ష్… ఢ్యాష్…
నీ అక్కని… …. ….
నీ చెల్లిని…. …. ….
నీ పెళ్లాన్ని…. ….. …
నీ కూతురిని…. ….. ….
ప్రతీ తిట్టు కూడా ఆడవారి మానాల చుట్టూ నే ఉంటుంది..

ఆడ వారి పై ఇంత నీచంగా తిట్లు ఉన్న దేశం కేవలం మన దేశం మాత్రమే..

ఆడ వారి లైంగిక అవయవాల మీద నే తిట్లన్నీ ఉంటాయి ఇక్కడ..

దయ్యం అనగానే తెల్లని చీర కట్టుకున్న స్త్రీ నే కనబడుతుంది., అంటే ఈ దేశం లో ఆడ వారిని ఎలా చిత్రిస్తున్నారో అర్థం అవుతుంది.

కవుల సిరా చుక్కల్లో.. పుస్తకాలలో కట్టు పిట్ట కథల్లో.. మాత్రమే స్త్రీలకి గౌరవం ఇచ్చి నిజజీవితం లో కనీసం మనిషిగా కూడా గుర్తించని ఏకైక దేశం మనదే..

ఏమన్నా అంటే స్త్రీ ల వస్త్రధారన పై ఏడుస్తారు.. కొంచెం స్త్రీ కాలు కనబడినా సొల్లు కార్చుకునే నరాల బలహీనత కలిగిన మగవాళ్ళు ఉన్న గొప్ప దేశం మనది.

పాశ్చాత్య దేశాల లో బికినీ మీద కళ్ళ ముందు పోయినా చూసి చూడనట్టు ఉండే మగవాళ్ళ నీ చూసి నేర్చుకోవద్ధా…

ఆడ వారి డ్రెస్సింగ్ లో కాదు లోపం మగ వారి చూపులో ఉంది.

ఆడ కూతురికి బిడ్డా ఇలా ఉండు అలా ప్రవర్తించు అని చెప్పే తల్లి దండ్రులే కానీ ఆడ వారిని గౌరవించాలి.. ఆడ వారితో ఇలా ప్రవర్తించాలి.. అలా నడుచుకోవాలి అని కొడుకులకి బుద్ధి చెప్పే తల్లిదండ్రులే కరువయ్యారు.

వేల సంవత్సరాలుగా సతీ సహగమనం పేరిట లక్షల మంది తల్లులను కాల్చి చంపిన ఏకైక దేశం ఇండియా.

బాల్య వివాహాలు చేసి పసిపాపల బ్రతుకులు ఆగం చేసిన దేశం మనది.

కన్యా శుల్కం పేరిట పసి పాపలను ముసలి వారికి కట్టబెట్టిన దౌర్భాగ్య దేశం మనది.

భర్త చనిపోయిన స్త్రీ నీ విధవ రాలు , ముండ పేరిట శుభ కార్యాలకి పిలవకుండా… ఆవిడ ఎదురొస్తే అశుభం అంటూ అవమానించిన దేశం కూడా మనదే..

స్త్రీ ని తమ ఇంటి పరువుకి ప్రతి రూపం గా చూస్తూ… పరువు హత్యలు చేస్తున్న దేశం కూడా మనదే..

ఓ వైపు భూ మాత , భారత మాత అంటూనే.. బట్టలు విప్పేసి పాశవికంగా మానాలపై తంతూ, సీసాలు రాడ్లు పెట్టీ పెట్రోల్ పోసి క్రూరంగా చంపి వేసే సమాజం మనది.

విదేశాలలో అంతరిక్ష యానం చేస్తే మన దేశం లో ఇంకా ఆడ దాని వస్త్రధారణ, కట్టు బొట్టు గురించి చర్చించే దగ్గరే ఉన్నారు.

ఈ దేశం లో స్త్రీలపై జరిగినన్ని దాడులు హత్యలు అత్యాచారాలు అవమానాలు ఎక్కడ కూడా జరగలేదు.

మా ఇంటి మహా లక్ష్మి అంటూనే.. పెళ్ళి పేరట వేరే వాని వంట గదిలో పడేస్తున్నారు.

ధైర్యంగా షాప్ కి వెళ్లి కనీసం శానిటరీ ప్యాడ్ కూడా కొనుక్కొలేని పరిస్థితి ఉందంటే ఎంతటి దౌర్భాగ్యం.. !

👉 ఈ దేశం లో ఉన్న ఆడ తల్లులారా, ఇకనైనా కట్టు బాట్ల కంచు సంకెళ్లను తెంచు కొండి.. !

సంస్కృతీ, సంప్రదాయాల ఇనుప కంచెల నుండి బయటకి రండి !

షూ లేసు లు భిగించండి…

జిమ్ లలో గ్రౌండ్ లలో మగవాళ్ళతో పోటీ పడి వ్యాయామాలు చేయండి..

ఆత్మ రక్షణకి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి.

హ్యాండ్ బ్యాగ్ లలో లిప్ స్టిక్ అద్దం కి బదులు డిఫెన్స్ కత్తి పెప్పర్ స్ప్రే పెట్టుకోండి..

బాగా చదవండి..
కష్టపడం డి..
మీకు నచ్చిన పనులే చేయండి…

మొదట ఆర్థికంగా ఓ శక్తిగా ఎదగండి !

ముందుగా.. మగవాడి పై ప్రతీ విషయానికి ఆధార పడటం మానండి.

డ్రామా క్వీన్ లుగా ఉండకండి!

ఫులన్ దేవి , కల్పన చావ్లా, పిటి ఉష , హిమదాస్ , మలావత్ పూర్ణ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి..

పౌరాణిక పిట్ట కథల్లోని.. పతి వ్రతా శిరోమణి పేరుతో ఉండే.. బలహీన, బానిస మనస్తత్వం ఉన్న స్త్రీ పాత్రలను ఆదర్శంగా తీసుకోకుండా, వాటిని పక్కన పడేయండి!

కొండ ఎక్కాలి అనిపిస్తే ఎక్కేసేయండి..

బిజినెస్ చేయాలి అనిపిస్తే చేసేయండి

దయచేసి పెళ్లిళ్లు చేసుకొని స్వేచ్ఛని పోగొట్టుకొని… ఒకడి కింద బానిసలుగా మాత్రం బ్రతకకండి!

ఐతే.. మీకు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే, లెదా తప్పదు అని మీరు అనుకుంటే.. మీరే బాగా ఆలోచించి, ఎదుటి వ్యక్తిని గమనించి, అన్నిరకాలుగా సూట్ అవుతాడు అనుకుంటేనే, మీ భాగస్వామిని మీరే ఎంపిక చేసుకుని, పెళ్ళి చేసుకోండి. అది కూడా high expectations లేకుండా.. !

ఇకనైనా రాఖీ లు చేత బట్టుకొని అన్నా నన్ను కాపాడు.. తమ్ముడు నన్ను ఆదుకో అంటూ తిరగకండి…

ధైర్యంగా ఉండండి..
స్వయం ఉపాధితో ఆత్మ గౌరవం తో బ్రతకండి!

ఆర్థికంగా శక్తివంతం కండి, అంటె అర్థికంగా ఎదగండి…

ఆత్మ న్యూనతా.. అభద్రతా భావాలను వదలండి..

మీకన్నా బలవంతులు, మీకన్నా తోపులు ఎవ్వరూ లేరు ఇక్కడ…

మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు..
మగొ, ఆడా తేడాయే లేదు..

ఉన్నది ఒక్కటే శారీరక బలం లో, దృఢత్వం లో తేడా అంతే.. ! దానితో పెద్దగా ఉపయోగం లేదు..
Mentally strong ఉంటే చాలు. ఇక మిమ్మల్ని మించిన వారు ఎవ్వరూ స్ట్రాంగ్ కాలేరు.

బానిస మనస్తత్వం తో.. మగవారిపై ఆధారపడే గుణం తో.. సంప్రదాయాలను కాపాడే ప్రతినిధులుగా మాత్రం అస్సలు ఉండకండి..

స్వేచ్చగా ఆకాశమే హద్దు గా ఎగరండి, ఎదగండి!
~ శ్రీహరి జాడి🖋️
(Copied From:
సురేందర్ ఉయ్యాల గారు..)
— Rajeshwer Chelimela