పత్రిక విజయంలో ఉద్యోగుల శ్రమ దాగుంటుంది. సమైక్యంగా చేసిన పని అంతిమంగా ఆ పత్రిక ఎడిటర్ కు, మేనేజ్మెంట్ కు మంచిపేరు తెచ్చిపెడుతుంది. ఉద్యోగులను ఓ జీతగాళ్లుగా, తమ బానిసలుగా చూసేవారున్న చోట ఉద్యోగుల కు గుర్తింపు ఉండదు.శ్రమ దోపిడీ తప్ప. నమస్తే తెలంగాణ లో అదే జరుగుతున్నది. ఎడిటర్ కృష్ణమూర్తి వచ్చిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి బానిసల కంటే అద్వాన్నంగా మారింది. మేనేజ్మెంట్ దగ్గర మెప్పు పొందేందుకు చాలా చీప్ విధానాలకు కూడా దిగేందుకు వెనుకాడడు. ‘మీ సంస్థకు నేనెంతో మేలు చేస్తున్నాన’నే తన బిల్డప్ కోసం, తన స్థాయి దిగజార్చుకుని, ఉద్యోగుల సంక్షేమాన్ని పాతరేసి, ‘అంతా నేనే చేస్తున్నాను, ఈ క్రెడిటంతా నాదే’ అనే కటింగ్ ఇవ్వడంలో ఆరితేరాడు. ఇటీవలే అక్కడ జరిగిన ఓ ఉదంతం కృ.తి కుత్సిత బుద్ధికి, కుంచించుకుపోయిన మనస్తత్వానికి నిదర్శనం. ఈ ఎడిటర్ వైఖరి ఆఖరికి ఎం.డీ ని కూడా అవమానించేలా, ముక్కున వేలేసుకునేలా చేసింది. అంతటి ఘనుడు మన కృ.తి. తాము ఎలాంటి ఎడిటర్ ను తెచ్చి పెట్టుకున్నామో దీన్ని చూసైనా కొంచెం సిగ్గుపడాలి మన టీఆరెస్ పెద్దలు.
‘పీవీ కి అక్షర నివాళి’ పేరుతో ‘నమస్తే’ ఓ బుక్కును రూపొందించింది. దీని రూపకల్పనలో ఓ ఐదుగురు ఉద్యోగులు విశేషంగా కృషి చేశారు. ఇది అందరినీ ఆకట్టుకుంది. ఎండీ గారికి ఈ బుక్కు విపరీతంగా నచ్చేసింది. ఈ పుస్తకం ఇలా రావడానికి కష్టపడ్డ ఆ ఐదుగురికి 20 వేల చొప్పున ఇవ్వండని కృష్ణ మూర్తి కి లక్ష రూపాయలు ఇచ్చాడు. మన కృ.తి కి కళ్లుకుట్టాయి. కడుపు మండింది. ‘అదేందీ… వస్తే గిస్తే నాకు పేరు రావాలి. నన్ను మెచ్చుకోవాలి. ఇలా కింద పనిచేసే ఉద్యోగులకు నజారానాలిస్తే వాళ్ళు మన చెప్పుచేతల్లో ఉంటారా? చెప్పింది వింటారా?’ అని అనుకున్నాడు సహజంగానే. 20 వేల చొప్పున ఐదుగురికి పంపిన కవర్లలో డబ్బులు తీసేసి, ఒక్కొక్క కవర్లో 2,500 చొప్పున పెట్టి పండగ చేసుకోండి అని తన అపార ఉదారతను చాటుకున్నాడు మహానుభావుడు. మిలిగిన మొత్తాన్ని ఎండీ గారికి తిరిగి పంపించేసి… ‘వీళ్లకు అదే ఎక్కువ సార్… డబ్బులెందుకు వృథా చేసుకుంటారు?’ అని ఓ ఉచిత సలహా ఇచ్చి, గొప్ప ఉపదేశం చేసి, పొదుపు మంత్రాన్ని జపించి, ‘నన్ను చేసి నేర్చుకో’ అని ఓ లుక్కిచ్చి అలా టక్కున వెళ్లిపోయాడంట. ఎండీ గారికి మైండ్ బ్లాక్ అయి కొద్దిసేపు ఏమి అర్థం కాలేదట. ఆ తర్వాత తేరుకొని నవ్వాలో ఏడ్వాలో తెలియక బిత్తిరి చూపులు చూశాడట. పాపం. నిజామాబాద్ యూనిట్ మేనేజర్ కూడా ఇలాగే సంస్థ ఖర్చుల కోసం డబ్బులు పంపితే అందులో ఏమీ ఖర్చుపెట్టకుండా.. అక్కడ సమస్యలు తీర్చకుండా వాటిని ఎక్కువ మొత్తంలో తిప్పి పంపి మేనేజ్మెంట్ దగ్గర మార్కులు కొట్టేసే వాడంట. తన సీటు పదికాలాలు ఇక పదిలం అని ఊపిరి పీల్చుకునేవాడట. ఆ మేనేజర్ కు, ఈ ఎడిటర్ కు పెద్ద తేడా లేదు. సీటు పదిలం చేసుకోవడం ముఖ్యం. అందుకోసం ఎందరినైనా బలి తీసుకున్నా ఏమీ కాదు.అది వ్యాపార రహస్యం.
