మళ్లీ రాష్ట్రానికి మహా ముప్పు పొంచి ఉందా? మూడో వేవ్‌కు దారి తీస్తుందా? ఉన్నట్టుండి మహారాష్ట్రలో కేసుల పెరుగుదల దేనికి సంకేతం.. మళ్లీ ఇప్పుడు అలర్ట్‌గా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్టు భావించాలా?
ఇప్పుడు మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా సరిహద్దులన్నీ మహారాష్ట్రకు ఆనుకుని ఉండటంతో ఈ కేసులు ఈజీగా తెలంగాణకు వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. గతంలోనూ ఇలా జరిగింది. ప్రమాద తీవ్రత పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో చాలా మంది మహారాష్ట్రకు చెందిన వారున్నారు. నిత్యం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడ్నుంచి ఇక్కడికి రాకపోకలు సాగుతాయి. దీంతో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా పెరిగితే అది జిల్లా నుంచి రాష్ట్రానికి వ్యాప్తి చెందడానికి ఎంతో సమయం పట్టదు. దీంతో అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అలర్ట్‌గా ఉండాల్సిన సమయం వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా … చెక్‌పోస్టులు పెట్టి, రాకపోకలు బంద్ చేస్తే అప్పుడు ఫలితం ఉండదు. ఇప్పట్నుంచే అలర్ట్‌గా ఉండాలి. నిజామాబాద్ జిల్లా కేసులు పెంచిన జిల్లాగా మారకముందే.. మూడోవేవ్‌కు ఇక్కడ్నుంచి ఊతం పడిందనే అపవాదు మూటగట్టుకోకముందే యంత్రాంగం, లీడర్లు మేలుకుంటే మేలు.