“జీతాలు ఒకటో తారీఖు పడతయ్ అనే మాట మరిచి చాన రోజులైంది బ్రదర్..”
“అదేందీ.. ఈ కరోనా టైంలో అందరూ ఇబ్బందులు పడ్డారు కానీ.. మీ గవర్నమెంటు ఉద్యోగులు కాదు కదా. ”
“మీకు అంతే తెలుసు కానీ. మాకు జీతాలు ఎప్పుడు పడతయో కూడా తెల్వని పరిస్థి ఏర్పడింది. ఏం చెప్పమంటవ్.. ”
” మొత్తానికైతే జీతాలు లేపుతున్నరు కదా. అవీ లేని వాళ్ల పరిస్థితి ఏందీ? మీరే చాలా నయం. ఇంకా ఏడుపెందుకు?”
“నెల కాంగనే మాకూ ఈఎంఐలు, కిస్తీలు ఉంటయ్ కదా భయ్. మేమన్న అప్పుల్లేకుండా దొరబాబుల్లా బతుకుతున్నామనుకున్నవ?”
“ఆ కిస్తీలకే ఇప్పుడు కొంపలు మునుగుతున్నయ?”
“మరి. మొన్నటి దాక ఈ జీతాలు ఎట్లైనా లేటు పడుతున్నయని, కిస్తీలు కట్టే డేట్‌లను ఒకటో తారీఖు నుంచి నాలుగుకు మార్చిన.”
“మళ్లీ మొన్న ఐదుకు మార్చిన.”
“ఇప్పుడైతే పదికి మార్చిన.”
“ఎందుకు?”
“అట్టైంది మరి మా పరిస్థితి. ఒకటో తారీఖ నుంచి ఇగ ఎదురుచూపులే . దీనమ్మ జీవితం. దీన మొగాలేసుకొని.”
“ఇప్పుడు వచ్చినయా లేదా?”
“వచ్చినయి మొత్తానికి పదో తారీఖు. అవి పడేదాక ఒకటే టెన్షన్ బై.”
“చెక్ ఏడ బౌన్స్ అయితదో అని.”
“ఈ జీతాలెప్పుడు పడతయో తెల్వక… మొన్నటి దాక బయటకెళ్లి తెచ్చి కిస్తీలకు సర్దుబాటు చేసిన.”
“ఇప్పుడైతే పదో తారీఖు డేట్ మార్చుకున్న కానీ… అవన్న ఆ డేట్ కు పడతయా. మరి ఇంకా లేట్ అవుతయ? తెల్వదు.”
“మీ డిపార్టెమెంటుకేనా? ఈ పరిస్థితి అందరికా?”
“ఒక్కో జిల్లాలో ఒక్కో
డేట్ ల వేస్తున్నారు. మా దగ్గరికొచ్చే సరికి పదో తారీఖు దాక వెయిట్ చేయాల్సి వస్తుంది. ”
“అందరి పరిస్థితి గట్లనే ఉంది బై. పైసల్ లేవంట. ఏం చేస్తం మరి.”
“నువ్వే పెద్ద ఇంజినీరు కదా బై.. నీ కాడ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుంటరు. వాళ్లిస్తలేరా పర్సెంటేజీలు.”
“వాళ్లకు బిల్లులు లేక ఏండ్లు గడుస్తుంది. కొట్టుకుంటున్నరు కొడుకులు. ఇగ మాకిచ్చేదేందీ?”
” పనులు చేయ్యండిరా బై అని టెండర్లు పెడితే. ఒక్కోదానికి ఐదారు కాల్స్ ఇచ్చినా.. ఎవడూ రావడం లే.”
” పైసలు లేకపోతే వాళ్లు కూడా ఏం జేస్తరు బై ”
“గదవలు పట్టుకొని బతులాడుడైతుంది కొంత మందిని. అరే గీ పనులు జర అర్జెంటున్నయి.. చెయ్యుండ్రా బై అని. ”
” అయినా ఇంటలేరు కొడుకులు. పోరా పో అన్నట్టు చూస్తున్నరు మమ్ముల..”
” ఇగ గీ జీతాల మీదనే మా బతుకు బై . అప్పటి దాక.”
” ఇదెప్పుడు సెట్ అయితుందో ఏమో?”
” ఒకటో తారీఖొస్తనే గుండెలో రాయి పడుతుంది.”
“అమ్మో ఒకటో తారీఖా ? అని బిక్కమొగాలేసుకొని జీతాల కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నం. దినదినం సస్తున్నం.”
