గత కొంత కాలంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో కొత్త కార్డులు జారీ కానున్నాయి. దీని కోసం ఎంక్వైరీ ప్రక్రియ ముగిసింది. అన్ని జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు డోర్ టు డోర్ ఎంక్వైరీ చేశారు. జీహెచ్ఎంసీలో సీఆర్వోసిబ్బంది, జీహెచ్ఎంసీ ఉద్యోగులు కలిసి ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టారు. .
రా|ష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల కొత్త రేషన్ కార్డులకు మంజూరు లభించనుంది. అయితే ఇప్పటి వరకు 87 లక్షల వరకు రేషన్ కార్డులున్నాయి. కొత్త రేషన్ కార్డులతో కలిపి ఈ సంఖ్య 91 లక్షలకు చేరుకోనుంది. 4. 50 లక్షల దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. లక్ష దరఖాస్తులను తిరస్కరించారు. కొత్తగా మళ్లి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా వెబ్ పోర్టల్‌ను నిలిపి వేశారు. ఏడాది క్రితం వరకు దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఈ నెల 26న జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేవలో నుంచి జిరాక్స్ ప్రతిని తీసి దాన్నే కొత్త రేషన్ కింద అందించనున్నారు.