పాపం..! హీరో సునీల్‌ బ‌క్రీద్ పండుగ ముబార‌క్ చెబితే మూతిప‌ళ్లు రాల‌గొట్టుకున్నంతా ప‌నైంది. సోష‌ల్ మీడియాలో హీరో పై మాట‌ల దాడికి దిగారు. ఎవ‌రైనా ముస్లీంలు హిందు పండుగ‌ల‌కు ఇలా శుభాకాంక్ష‌లు చెబుతున్నారా? అంటూ అసంబ‌ద్ధ ప్ర‌శ్న‌ల‌తో సునీల్ పై దాడికి దిగారు. ముస్లీం వేశ‌ధార‌ణ‌లో ముబార‌క్ చెప్ప‌డ‌మే సునీల్ త‌ప్పైంది. గ‌తంలో అన‌సూయ సైతం ఇదే విధంగా శుభాకాంక్ష‌లు చెప్పిందంటూ ప‌నిలో ప‌నిగా ఆమె ప్ర‌స్తావ‌న కూడా తీసుకువ‌చ్చారు. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి మ‌త సంబంధ‌మైన పోస్టుల విష‌యంలో అతిగా స్పందించ‌డం ప‌రిపాటిగా మారింది. ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని మ‌రో మ‌త‌స్తులు ఇష్టానుసారం త‌మ అభిప్రాయాల‌ను, సంకుచిత భావాల‌ను య‌ధేచ్చ‌గా వెల్ల‌డించేందుకు సోష‌ల్ మీడియా ఇప్పుడు ఓ వేదికైంది. సెల‌బ్రిటీలుగా గుర్తింపు పొందిన త‌ర్వాత వారు స్పందించే తీరు పై వెంట‌నే విరుచుకుప‌డేందుకు ఓ సెక్ష‌న్ రెడీగా ఉంటుంది. ఆ సెక్ష‌న్ ఇప్పుడు మ‌తం రంగు పులుముకొని సోష‌
ల్ మీడియాలో బుస‌లుకొడుతున్న‌ది.

You missed