ఒక అమ్మాయిని దూరద్రుష్టితోనే చూస్తాం మనం. కానీ ఒక అమ్మాయి నవ్వు వెనుక మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్లు పడే నరకయాతన మనకు తెలియదు. . ఆ నొప్పి భరించలేం. ఎంత రక్తం పోతున్నా ఓర్చుకుంటు నవ్వుతూ అన్ని పనులు చేస్తూ తిరుగుతూ ఉంటారు. నిలబడలేరు. కూర్చోలేరు. పడుకోలేరు. తిరగలేరు. ఆ నాలుగు రోజులు నరకం అనుభవిస్తారు. తిండి తినలేరు. ఒళ్లంతా నొప్పులతో ఉంటారు. వచ్చే నెల మళ్లీ అదే నరకం. కడుపుతో ఉన్నప్పుడు కూడా… కడుపులో బిడ్డని పెట్టుకొని అన్ని పనులు చేస్తారు. అంత బరువును కడుపులో పెట్టుకొని మోస్తారు. ఆడవాళ్లు పడే నొప్పి, కష్టం, బాధ, నరకం… మన మగవాళ్లు కొంచెం కూడా అనుభవించలేం. వాళ్లు ఎంత నరకం పడుతున్నా బయటకు ఎలా నవ్వుతూ తిరుగుతారో…!!
మనం వాళ్ల అందం చూసి, వాళ్ల సంతోషం చూసి వాళ్లు సంతోషంగా ఉన్నారు అనుకుంటాం. అది మన పొరపాటు. వాళ్లకు ఎలాంటి బాధలు ఉన్నా నవ్వుతూ తిరుగుతారు. మాట్లాడతారు. అదే వాళ్ల గొప్పతనం. వాళ్లలాగ మనం ఒక్కరోజు కూడా ఉండలేము. అందుకే ఆడవాళ్లను దైవంతో సమానంగా చూస్తారు. అందుకే వాళ్ల అందం కాదు, వాళ్ల మనసు తెలుసుకొని వాళ్లని ఇష్టపడండి. వేరే అమ్మాయిని ఎగతాళి చేసి ఏడిపించే ముందు మన ఇంట్లో అక్కా చెళ్లెల్లు ఉంటారని మనసులో పెట్టుకుని ప్రవర్తించండి. ప్రతి అమ్మాయి అమ్మతో సమానం
(మాధవరెడ్డి బుట్టెంగారి)
