పండితపుత్రః రౌడీ టైపట..! కవితక్క, రామన్న ఇద్దరిదీ అదే బెదిరింపు బాట…! నాన్న మంచోడేనంటూ కితాబు.. తమతో పెట్టుకోవద్దంటూ దబాయింపు..! పింక్ బుక్కులో ఎక్కిస్తామంటున్నారు…! ఎక్కడ దాక్కున్నా పట్టుకుని పనిపడతామంటున్నారు..!!
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్ వేల పుస్తకాలు చదివాడు. మేధావి. ప్రపంచ జ్ఞాని. దేశాన్ని ఏలాల్సినోడే. కానీ టైం బాగాలేక ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు. మళ్లీ ఆయనను జనాలు కోరుకుంటున్నారు. కేసీఆర్ రావాలి. కావాలంటున్నారు. సరైన సమయంలోనే ఆయన మాట్లాడతాడు. అప్పటి వరకు ఎవరెన్ని…