ఈ ఇందూరు స్టూడెంట్స్…. గ్రేట్ రైటర్స్…రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదువుతూ… అద్బుత నవలలకు అక్షరాలు ఏర్చి కూర్చిన 12 మంది విద్యార్థినులు…హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ప్రదర్శన… అద్బుత రచనలకు అచ్చెరువొందిన పుస్తక ప్రియులు.. విద్యార్థినులతో మంత్రి ఇంటరాక్ట్… ప్రశంసలు.. కలసి భోజనం చేసిన వేముల..
మట్టిలో మాణిక్యాలు వీరు… చదివేది ప్రభుత్వ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో. చదివేది ఎక్కడైతే ఏందీ..? వారిలో టాలెంట్‌ను బయటకు తీసింది ఈ ప్రభుత్వ విద్య. పన్నెండు మంది విద్యార్థులు… ఒక్కొక్కరు ఒక్కో కాన్సెప్ట్ ఎంచుకున్నారు. అప్పుడప్పుడే అక్షరాలను ఏర్చికూర్చడం…