బీజేపీ పుండు మీద.. అర్వింద్ కారం… ఇప్పటికే దిగచెడి ఉన్న ఇందూరు బీజేపీ…తాజాగా మండలాల అధ్యక్షుల మార్పుతో మరింత రచ్చ .. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అర్వింద్ వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు, నాయకుల ఆందోళన.. కాంగ్రెస్‌కు లోపాయికారిగా ఉపయోగపడేందుకే ఈ చర్యలంటూ స్వపక్షంలో అర్వింద్‌పై ఆరోపణాస్త్రాలు…
అసలే ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మూలిగే నక్క మీద తాటికాయపడ్డట్టు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేస్తున్న చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు, దుందుడుకు చర్యలు ఆ పార్టీని జిల్లాలో నిలువునా ముంచుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ మేమే బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం…