వెంటాడుతున్న పాపం.. ధర్నాచౌక్..! ఆ పేరును ఉచ్చరించేందుకే జంకుతున్న కల్వకుంట్ల టీమ్..! అప్పుడు ఆ ధర్నాచౌక్‌ను ఎత్తేసి.. ఇప్పుడు ఇందిరాపార్క్ వద్ద అని పిలుచుకుంటున్న వైనం… ఆత్మవంచనకు పరాకాష్ట..!
(దండుగుల శ్రీనివాస్) అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించారు. అక్కడ ధర్నాచౌక్ ఎందుకన్నాడు జాతిపిత. అనుకున్నదే తడవు ఎత్తేసేదాకా వదల్లేదు. ఇప్పుడు ఆ ధర్నాచౌకే ఓ కేటీఆర్‌కు, ఓ కవితకు ఉద్యమాలు చేసేందుకు వేదికయ్యాయి. ఆ చౌక్ నీడన ఉనికి చాటుకునే…