(దండుగుల శ్రీనివాస్)
అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించారు. అక్కడ ధర్నాచౌక్ ఎందుకన్నాడు జాతిపిత. అనుకున్నదే తడవు ఎత్తేసేదాకా వదల్లేదు. ఇప్పుడు ఆ ధర్నాచౌకే ఓ కేటీఆర్‌కు, ఓ కవితకు ఉద్యమాలు చేసేందుకు వేదికయ్యాయి. ఆ చౌక్ నీడన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అహంకారం మాత్రం వీడలేదు. ఆ పాపం వెంటాడుతున్నా ఆత్మవంచన మాత్రం వదల్లేదు. ఆ ధర్నాచౌక్ పేరే ఉచ్చరించేందుకు జంకుతున్నారు.
దానికి కల్వకుంట్ల కుటుంబం ముద్దుగా పెట్టుకున్న పేరు ఇందిరాపార్క్ వద్ద అని. ఇంతకన్నా ఆత్మవంచన ఉండదు. అంటే మీ నాయన చేసిన అహంకారపూరిత చర్యలను ఇలా మీరు కంటిన్యూ చేస్తున్నారన్నమాట. నాయనే వద్దన్నాడు. ఇక మేమెలా దానిపేరు ఉచ్చిరిస్తాం అని సమర్థించుకున్నారు కాబోలు.. అందుకే అన్నాచెళ్లెల్లు ఇద్దరూ ధర్నాచౌక్ పేరును తమ నోటివెంటే రానీయడం లేదు. వారి నోటి వెంటే కాదు.. తమనే ఇంకా గుడ్డిగా నమ్ముకుని వస్తన్న వారిని కూడా అలా పలకొద్దన్నారులా ఉంది.
అందుకే వారూ కాపీ పేస్టులా ఇందిరాపార్క్ వద్దే అని పోస్టులు పెడుతున్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ధర్నాచౌక్ అని సంభోదించడం లేదు ఆ ప్లేస్‌ను.