కామారెడ్డికి కేసీఆర్ తొలివరం… మిషన్ భగీరథ పైపుల కోసం 195 కోట్లు… పన్నేండ్ల క్రితం వేసిన నాసిరకం పైపుల స్థానంలో ఇక నాణ్యతతో కూడిన పైపులు పోచాంపాడ్ నుంచి కామారెడ్డి మల్లన్నగుట్ట వరకు 45 కి.మీ వరకు పైప్‌లైన్లకు టెండర్లు పూర్తి… ఆరు నెలల్లో పనులు పూర్తి… కామారెడ్డి మంచినీటిపై ఆరా తీసిన కేసీఆర్.. వెనువెంటనే శాశ్వత పరిష్కారం… మరో యాభై ఏండ్ల వరకు కామారెడ్డి ప్రజల నీటికి డోకా లేదు…
అది కాంగ్రెస్ జమానా. షబ్బీర్ అలీ కాలం. ఆయనదే హవా. పోచంపాడ్ నుంచి కామారెడ్డికి మంచినీటిని అందించే పథకానికి మల్లన్నగుట్ట వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు. పైప్‌లైన్లు వేశారు. కానీ అవి నాసిరకం. పన్నేండేండ్లయ్యింది. ఎప్పడూ మరమ్మతులే. జనాలకు కల్తీనీళ్లే. కామారెడ్డి…