అది కాంగ్రెస్ జమానా. షబ్బీర్ అలీ కాలం. ఆయనదే హవా. పోచంపాడ్ నుంచి కామారెడ్డికి మంచినీటిని అందించే పథకానికి మల్లన్నగుట్ట వద్ద ట్యాంకులు ఏర్పాటు చేశారు. పైప్‌లైన్లు వేశారు. కానీ అవి నాసిరకం. పన్నేండేండ్లయ్యింది. ఎప్పడూ మరమ్మతులే. జనాలకు కల్తీనీళ్లే. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడానికి డిసైడ్ అయిన తర్వాత ఆయన ఇక్కడి నాయకులతో ఎప్పటికప్పుడు పరిస్థితులు ఆరా తీస్తున్నారు. తొలత ఆయన దృష్టికి వచ్చింది.. ఇదే. షబ్బీర్ అలీ కమీషన్ల కోసం నాసిరకం పైపులు వేశాడని, వీటిని తొలగించి కొత్తవి వేయాలని నాయకులు చెప్పిన వెంటనే కేసీఆర్ స్పందించారు.
ఇందుకు నాణ్యమైన పైపులను 45 కిమీ మేర వేసేందుకు ఎన్ని నిధులు అవసరమో అంచనా వేశాడు. 195 కోట్లు అవసరమని అధికారుల ద్వారా అంచనాలు రూపొందించి వెంటనే వాటికి టెండర్లు నిర్వహించారు. మరో ఆరునెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. దాదాపు మరో యాభై ఏండ్ల వరకు ఈ పైపులకు డోకా లేదు. కామారెడ్డిలో కేసీఆర్ కాలుమోపక ముందే పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే మహత్తర కార్యక్రమానికి నాంది పలికారని బీఆరెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు కామరెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, సీనియర్ నాయకుడు లోయపల్లి నర్సింగరావు తదితరులు ఈ మేరకు విలేకరుల సమావేశం పెట్టి వివరాలు వెల్లండించారు.కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.