చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విషయంలో ఎవరు చేశారో తెలియదు గాని కచ్చితంగా అది మన సెల్ఫ్ గోల్…వాని అరెస్ట్ వెనుక,వాని ఆఫీస్ పైన రైడ్ సంఘటనలో టీఆరెస్ పార్టీ కి సంబంధం మాత్రం లేదనేది సుస్పష్టం!!!
వాణ్ణి ఇబ్బంది పెట్టాలి అనుకుంటే టీఆరెస్ పార్టీకి లక్ష కారణాలు ఉన్నాయి…లక్ష కేసులు కనీసం ఓ 10 నెలలైనా బెయిల్ దొరకకుండా లోపల వేసేంత కఠినమైన శిక్షలు వేసే సెక్షన్ లతో , చట్టానికి లోబడి దునియా చేయచ్చు.
వాని మీద పెట్టిన కేసు, సెక్షన్ లు…ఈ మధ్య కరీంనగర్ లో మన టీఆరెస్ సోషల్మీడియా వారియర్స్ మీద ఒక అమ్మాయి పెట్టిన రెండు కేసులు సేమ్..మనోళ్లు స్టేషన్ బెయిల్ మీద బయటికి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చెసుకుంటున్నారు…వీడు అంతే…స్టేషన్ కి అటు పోయి ఇటు వచ్చి సింపతి గెన్ చేసుకున్నాడు.
మొన్నటి సంఘటన తో టీఆరెస్ పార్టీకి జరిగిన లాభం కన్నా నష్టమే ఎక్కవ…దీని వల్ల వానికి రెండు జాతీయ పార్టీల మద్దతు, వాళ్ళ ముఖ్య నాయకుల మద్దతు పెంచి ఇంకొంచం పెద్దోన్ని చేశారు వాన్ని.
చివరిగా ఒక్క మాట…ఆ సంఘటన జరిగిన రోజునే కరీంనగర్ లో వాని ప్రోగ్రామ్ ఉండే…దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలని ఓ 50 మందిమి అనుకున్నాం…కానీ పార్టీ పెద్దలకు చెప్పితే , అవసరం లేదని పార్టీ పెద్దలు సూచించారు… మెం మా ప్రోగ్రాం ని క్యాన్సిల్ చేసాం.
కాబట్టి మిత్రులకు విన్నపం ఏంటంటే…మీరు ఏది చేసినా పార్టీ క్రమశిక్షణ నియమావళికి కట్టుబడి , పార్టీ పెద్దలను సంప్రదించి చేయండి.
పొన్నాల సతీష్ కుమార్