నిజామాబాద్‌లో రాజకీయం రంజుగా మారింది. ఇప్పటికే మున్నూరు కాపులంతా అర్వింద్ వైఖరితో టీఆరెస్ వైపు చూస్తున్నారు. మొన్నటి వరకు డీఎస్ ముఖం చూసి ఆ కుటుంబానికి విధేయులుగా ఉన్నా… డీఎస్ క్రమంగా రాజకీయాలకు దూరం కావడం… అర్వింద్ వైఖరి , ఒంటెత్తు పోకడలతో ఆ కులానికి చెందిన వారంతా దూరమవుతూ వస్తున్నారు. మొన్న నగరంలో జరిగిన మున్నూరుకాపు వనభోజనాలకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి హాజరయిన విషయం తెలిసిందే.
ఇదే మరవకముందే .. ఇవాళ ఎమ్మెల్సీ కవిత అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అబద్దాలు చెబుతూ.. వాస్తవదూరమైన ఆరోపణలు చేస్తున్న అర్వింద్‌ను నిజామాబాద్ నడిరోడ్డుపై చెప్పుతో కొడతానని ఆమె అనడంతో రాజకీయంగా దుమారం రేపింది. ఈ విషయంపై రాష్ట్ర ఉమెన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత స్పందించారు. అర్వింద్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఓ ఆడబిడ్డను ఇష్టానుసారం మాట్లాడి బాధపెట్టిన అర్వింద్ వైఖరకి మార్చుకోవాలని, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఈ పరిణామం ఆ కలంలో చర్చకు వచ్చింది. అర్వింద్‌ను నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే అభిప్రాయంతో ఉన్నారు.దీంతో డీఎస్ కాపాడుకుంటూ వచ్చిన ఆ కుల వర్గమంతా ఇప్పుడు టీఆరెస్ గుంపులో కలిసిపోతున్నది. దీనికి అన్యపదేశంగా, అనాలోచితంగా అర్విందే దోహదం చేస్తున్నాడనంలో ఎలాంటి సందేహం లేదు.