బోధన్ ఎమ్మెల్యే షకీల్ మళ్లీ అలకపాన్పెక్కాడు. అతనికి ఇది అలవాటుగా కూడా మారింది. తనను అధిష్ఠానం పట్టించుకోవడం లేదని పలుమార్లు ఆయన అలకవహించారు. నియోజకవర్గానికి రాకుండా దూర దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆ యన పెట్టిన ప్రపోజల్‌ను అధిష్టానం తిరస్కరించింది. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అన్నట్టుగా అలిగి దూరం దూరంగా ఉన్నారు. తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నర్సింగ్ రావుకు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చాడు షకీల్.
కానీ అధిష్టానం ఓకే అనలేదు. నర్సింగ్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం… ఇప్పటికే జడ్పీ చైర్మన్ పదవి దాదాన్న గారి విఠల్ రావుకు ఇచ్చి ఉండటంతో సమీకరణల కుదరనవే ఉద్దేశ్యంతో అధిష్టానం తర్జనభర్జనలో పడింది. దీంతో ఇది అటకెక్కింది. మరోవైపు అర్బన్ ఎమ్మెల్యే కూడా దీనిపై పట్టుబట్టాడు. తన నియోజకవర్గానికి మార్కెట్ కమిటీ కేటాయించాలని కోరుతూ వచ్చాడు. తన తరపున ఒకరిద్దరి పేర్లు కూడా చెప్పాడు. కానీ అదీ ఎటూ తేలలేదు. నుడా చైర్మన్ రూరల్ నియోజకవర్గానికి కేటాయించాలని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
ఈ క్రమంలో అర్బన్‌కే ఏఎంసీ ఇస్తారా..? లేదా రూరల్ కే ఏఎంసీని కేటాయిస్తారా..? అని అనుకుంటున్న సమయంలో .. బోధన్ ఎమ్మెల్యే మరింత పట్టుపెంచాడు. బెట్టు చేస్తున్నాడు. నన్ను మరీ చులకన చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. తన మాటకు విలువ ఇవ్వకపోతే.. ఎవరు పట్టించుకుంటారు..? ఏఎంసీ చైర్మన్ ఇవ్వకపోతే.. ఇకపై మిమ్మల్ని ఏమీ అడిగేది లేదు….. ఆశించేది లేదు..కలిసేది లేదు… కలివిడిగా ఉండేది లేదు.. అనే రేంజ్‌లో ఓ ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసి అజ్జాతంలోకి వెళ్లిపోయాడట.