ప్రభాస్. తెలుగు సినిమాకు దొరికిన ఓ అగ్రహీరో. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాకు కరెక్టుగా యాప్ట్ అయిన హీరో. ప్రభాస్ కెరీర్ బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనే రేంజ్‌లో మార్చేశాడు దర్శకుడు రాజమౌళి. వాస్తవంగా ప్రభాస్ ఠీవీ, ఆ శరీరధారుఢ్యం, ఆజానుబాహుడిగా అందరినీ ఆకట్టుకునే ఆకారం, ముఖ వర్చస్సు.. అనే ఒకే. ఒక్క డైలాగ్ డెలివరీ తప్ప. ప్రభాస్ డైలాగ్ డెలివరీ పూర్. అనర్గళంగా చాంతాడంత ఓడైలాగ్‌ను గుక్కతిప్పుకోకుండా చెప్పడం ప్రభాస్ వల్ల కాదు. ఆ స్వరమూ ఆయనకు మైనసే.
కానీ అన్నీ కాదని బాహుబలి అతన్ని పాన్ ఇండియా హీరోను చేసింది. కానీ బాహుబలి తర్వాత అంచనాల పెరిగాయి. మార్కెట్ అలా తయారయ్యింది. ట్రెండ్ అలా సెట్ చేసి వదిలాడు రాజమౌళి. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ను కరెక్టుగా ప్రొజెక్టు చేసిన డైరెక్టర్ ఎవరూ లేరు.అన్నీ ప్లాపులే. అతని అమాయకత్వం, మంచితనం తన కెరీర్‌ను నాశనం చేస్తున్నదనే చెప్పాలి. కథల ఎంపికలో దారి తప్పాడు. ఎవరు సలహా ఇస్తున్నారు. మాయచేస్తున్నారో..? మభ్యపెడుతున్నారో..? డైరెక్టర్ల మీద అంతి అంచనాలో తెలియదు. కానీ అతన్ని ఘోరంగా దెబ్బ తీశాయి. రాధేశ్యామ్ సినిమా కోట్లు పెట్టి తీశారు. పాన్ ఇండియా సినిమా. కానీ ఘోరంగా బోల్తా కొట్టింది. కంటెంట్ లేదు. కథ లేదు. ఎందుకు ఆ కథను ఒప్పుకున్నాడో తెలియదు.
ఎవరు ఒప్పించారో తెలియదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో…. కంగాళీ కథ. అతని స్థామినాను పాతాళంలోకి నెట్టేసిన సినిమా. తాజాగా ఆది పురుష్. ఓ కార్టున్ సినిమా తీసిన మాదిరిగా దాని ట్రయిలర్. అది చూసినప్పుడే తెలిసిపోతుంది అది ఎంతగా ఆడుతుందో..? ఆకట్టుకుంటుందో… పాపం పిటీ ప్రభాస్. ఎక్కడి నుంచో ఎక్కడికో ఎదిగాడు. కానీ సరైన దర్శకుడు, కథ దొరకక… అమాయకత్వం. మనుషుల్ని గుడ్డిగా నమ్మడం, మంచితనం అతని కొంప ముంచుతుంది. అదే కెరీర్‌ను పాతాళంలోకి నెట్టేస్తుంది.