తెలంగాణ మాండ‌లిక ప‌దాల‌మాటేమో గానీ, గ్రాంథిక తెలుగుకూ తెగులు ప‌ట్టించేశారు మ‌న అధికారులు. ఓ అధికారిక ప్ర‌క‌ట‌న ఎలా ఉండాలి. ఎక్క‌డా అక్ష‌ర దోషాలు లేకుండా ఒక‌టికి ప‌ది సార్లు చెక్ చేసుకుని అధికారి వ‌ద్ద‌కు పంపాలి. స‌ద‌రు అధికారి కూడా ఓ సారి చెక్ చేసుకుని చివ‌ర‌గా త‌న సంత‌కం పెట్టిన త‌ర్వాత అది మీడియాకు విడుద‌ల‌వుతుంది. కానీ రంగారెడ్డి జిల్లాలో ఉపాధి కార్యాల‌యం అధికారులు .. ఎవ‌రికి ఉపాధి క‌ల్పిస్తున్నారో తెలియ‌దు కానీ.. వారి ఉద్యోగ బాధ్య‌త‌లు కూడా స‌రిగ్గా నిర్వ‌హించుకోక ఇలా న‌వ్వుల పాల‌వుతున్నారు.

తెలుగులో ఓ ప్ర‌క‌ట‌న ఇలా విడుద‌ల చేశారు. అది కంపోజ్ చేసిన త‌ర్వాతైనా ఓసారి చూసుకున్నారంటే లేదు. అలా చేతులు మారి మారి చివ‌ర‌కు అది అధికారికంగా రిలీజ్ అయ్యిందే కానీ.. దాన్ని సారాన్ని ప‌ట్టుకోలేదు. సారాంశాన్ని చూసుకోలేదు. అర్థాలు వెతుక్కోలేదు. అక్ష‌ర దోషాలు గాలికొదిలేశారు. ఇదిగో ఇప్పుడిలా న‌లుగురిలో న‌గుబాటుగా మిగిలింది.