నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా… డుగ్గు డుగ్గు డగ్గు డుగ్గు డుగ్గని…
పాటకు పెండ్లి కూతురు వేసిన స్టెప్స్ ఇప్పటి మరిచిపోరు. ఆ అమ్మాయి అంత బాగా చేసింది డ్యాన్సు. ఎక్కడా ఆగకుండా.. పాటకనుగుణంగా లయబద్దంగా ఆమె పెండ్లి భరాత్‌లో చేసిన ఆమె డ్యాన్సు అందరినీ ఆకట్టుకున్నది. అంత ఫేమస్ అయిపోయింది ఆ పెండ్లి పిల్ల. ఆ తర్వాత అదో ట్రెండ్‌గా మారింది. చాలా రోజుల పాటు ఈ ట్రెండ్ కొనసాగింది. ఎవరెంత డ్యాన్సు చేసినా… ఈ పిల్లంతా మాత్రం ఆకట్టుకోలేకపోయారు.
ఆ పెండ్లి పిల్ల ఫేమస్ అయ్యింది కానీ.. ఆమె భర్త మాత్రం అంత ఫేమస్ కాలేదు. ఇగో ఇన్ని రోజులకు ఇలా అతనూ ఫేమస్ అయ్యాడు. ఇలా. లంచం తీసుకుని. మల్లోసారి ఈ బుల్లెడ్ బండి అందరికీ యాదికొచ్చింది. యూట్యూబ్‌లో మల్లోసారి ఓపెన్ చేసుకుని మరీ చూస్తున్నారు. ఇప్పుడు పెండ్లి పిల్లను కాదు.. ఆమె మొగుడిని.